DNS: ధనుష్ నాగార్జున మూవీకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్.. క్రేజీ అప్డేట్-national award winning music director devi sri prasad to dns ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  National Award Winning Music Director Devi Sri Prasad To Dns

DNS: ధనుష్ నాగార్జున మూవీకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్.. క్రేజీ అప్డేట్

Sanjiv Kumar HT Telugu
Jan 21, 2024 06:40 AM IST

National Award Winner Music Director To DNS: నాగార్జున, ధనుష్ నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ #DNS కోసం నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందిస్తున్నట్లు తాజాగా మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ధనుష్ నాగార్జున మూవీకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్.. క్రేజీ అప్డేట్
ధనుష్ నాగార్జున మూవీకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్.. క్రేజీ అప్డేట్

DNS Music Director: నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్‌ వస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ #DNS. ఈ డీఎన్ఎస్ మూవీ మూడు రోజుల క్రితం చాలా గ్రాండ్‌గా లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా లాంచ్‌కి ఒక రోజు ముందే స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా హీరోయిన్‌గా నటిస్తోంది.

శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ బ్యానర్స్‌పై డీఎన్ఎస్ మూవీని నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావులు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే సోనాలి నారంగ్ సమర్పిస్తున్నారు. తాజాగా డీఎన్ఎస్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సినిమాకు సంగీతం ఎవరు అందిస్తున్నారో చెప్పారు.

"డీఎన్ఎస్ కుటుంబానికి అడిషనల్‌గా మరో పవర్ హౌజ్ యాడ్ అయింది. మేము రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ను ఆహ్వానిస్తున్నందుకు చాలా ఎగ్జయిటింగ్‌గా సంతోషంగా ఉంది. మీ మదిని దోచుకునే అద్భుతమైన పాటల కోసం రెడీగా ఉండండి" అని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP నిర్మాణ సంస్థ అధికారిక ట్విటర్ పేజీ నుంచి పోస్ట్ విడుదల చేశారు. దీంతో నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటుడు, దర్శకుడు ఉన్న సినిమాకు జాతీయ అవార్డ్ అందుకున్న దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందించడం పట్ల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

కాగా సౌత్ హీరో స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నాగార్జునతో సినిమా అనగానే సూపర్ బజ్ క్రియేట్ అయింది. దానికి తోడు ఈ సినిమాకు సెన్సిబుల్, రిచ్ కంటెంట్‌ వంటి సినిమాలు చేయడంలో నిష్ణాతుడైన శేఖర్ కమ్ముల డైరెక్టర్ అని తెలియగానే ఈ చిత్రానికి అదిరిపోయే హైప్ వచ్చింది. అంతేకాకుండా ఇందులో హీరోయిన్‌గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా నటిస్తోందని తెలిసాకా.. ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేస్తున్నాయి.

ఇలా నాగార్జున, ధనుష్, శేఖర్ కమ్ముల డీఎన్ఎస్ మూవీ దక్షిణాది చిత్ర పరిశ్రమలో సూపర్ బజ్ క్రియేట్ చేసుకుని హాట్ టాపిక్ అవుతోంది. ఇదిలా ఉంటే దేవి శ్రీ ప్రసాద్‌కు సంగీత దర్శకుడిగా ఎన్నో అవార్డులు అందాయి. వాటిలో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునేది నేషనల్ అవార్డ్. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప ది రైజింగ్ మూవీకి గాను దేవి శ్రీ ప్రసాద్‌కు నేషనల్ అవార్డ్ వచ్చింది. పుష్ప మూవీలోని పాటలు ఏ రకంగా ట్రెండ్ అయ్యాయో తెలిసిందే.

కాగా దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం వరుస సినిమాలు సంగీతం అందిస్తూ బిజీగా ఉన్నాడు. పుష్ప పార్ట్ 1కు సీక్వెల్‌గా వస్తోన్న పుష్ప ది రూల్ మూవీతోపాటు నాగ చైతన్య తండేల్, తమిళ అగ్ర హీరో సూర్య కంగువ, అజిత్ AK63 వంటి పాన్ ఇండియా చిత్రాలకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇవే కాకుండా పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రెండోసారి వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి, విశాల్ రత్నం చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు.

WhatsApp channel