Captain Miller Twitter Review: ధనుష్‍కు మరో హిట్ దక్కినట్టేనా! కెప్టెన్ మిల్లర్ సినిమాపై నెటిజన్ల స్పందన ఇదే
Captain Miller Twitter Review: ధనుష్ హీరోగా నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమా తమిళంలో రిలీజ్ అయింది. పొంగల్/సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఎలా స్పందిస్తున్నారంటే..
Captain Miller Twitter Review: తమిళ స్టార్ హీరో ధనుశ్ ప్రధాన పాత్రలో నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా తమిళంలో రిలీజ్ అయింది. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో బ్రిటీష్ పాలన నాటి బ్యాక్‍డ్రాప్‍లో పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకు అన్నీ ఈ చిత్రంపై క్యూరియాసిటినీ పెంచేశాయి. తెలుగులో పోటీ ఎక్కువగా ఉండటంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో జనవరి 25న రిలీజ్ కానుంది. అయితే, తమిళంలో పొంగల్ సందర్భంగా నేడే (జనవరి1 12) కెప్టెన్ మిల్లర్ విడుదలైంది. ఈ సినిమా చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో ఎలా స్పందిస్తున్నారంటే..
కెప్టెన్ మిల్లర్ చిత్రానికి ఇప్పటికే భారీగా పాజిటివ్ టాక్ వస్తోంది. ధనుష్‍కు మరో బ్లాక్‍బాస్టర్ పక్కా అని చిత్రం చూసిన ప్రేక్షకులు ట్వీట్లు చేస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ మిల్లర్ స్టోరీ, కాన్‍ఫ్లిక్ట్స్, క్యారెక్టర్స్ అదిరిపోయాయని చాలా మంది పోస్టులు చేస్తున్నారు. యాక్షన్ సీన్లు అద్భుతంగా ఉన్నాయని సంబరపడుతున్నారు.
ముఖ్యంగా ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి చాలా మంది నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొందరైతే హాలీవుడ్ రేంజ్‍లో కెప్టెన్ మిల్లర్ ఉందంటూ ట్వీట్లు చేస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. క్లైమాక్స్ ఈ చిత్రానికి హైలైట్ అని అంటున్నారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ గురించే ఎక్కువ ప్రశంసలు వస్తున్నాయి. సినిమా మొత్తం ఎంగేజింగ్‍గా ఉంటుందని, గూజ్‍బంప్స్ మూవ్‍మెంట్స్ చాలానే ఉన్నాయని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.
కెప్టెన్ మిల్లర్ చిత్రంలో ధనుష్ పర్ఫార్మెన్స్ గురించి అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. తన నటన, యాక్షన్, ఎమోషన్‍తో ఈ చిత్రాన్ని ఎక్కడితే తీసుకెళ్లాలని అంటున్నారు. దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ టేకింగ్, స్టోరీ టెల్లింగ్ అబ్బురపరిచిందని కొందరు ట్వీట్లు చేస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కనిపించేది కాసేపే అయినా చాలా ఇంపాక్ట్ చూపించే పాత్ర అని అంటున్నారు. తెలుగు నటుడు సందీప్ కిషన్, ప్రియాంక అరుళ్ మోహన్ నటన కూడా మెప్పిస్తుందని కామెంట్లు వస్తున్నాయి.
మొత్తంగా కెప్టెన్ మిల్లర్‌కు వీక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ఫస్ట్ హాఫ్ ప్రారంభంలో కాస్త నెమ్మదిగా అనిపించినా.. ఆ తర్వాత సినిమా మొత్తం ఎంగేజింగ్‍గా ఉందని ట్వీట్లు వస్తున్నాయి. సిద్ధార్థ నూని సినిమాటోగ్రఫీ కూడా మెరుగ్గా ఉందని అభిప్రాయాలు వస్తున్నాయి.
కెప్టెన్ మిల్లర్ చిత్రంలో ఈసా అనే పాత్ర చేశారు ధనుష్. అయితే, ఓ సందర్భంలో ఆయన మిల్లర్ అనే పేరుతో బ్రిటీష్ ఆర్మీలో జాయిన్ అవుతారు. అయితే, బ్రిటీషర్ల అరాచకాలు చూసి.. తమ గ్రామం కోసం పోరాడేందుకు ఈసా తిరిగి వచ్చేస్తారు. తమ ప్రాంతం కోసం బ్రిటీషర్లపై తిరుగుబాటు చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ మూవీ కథగా ఉంది.
కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిల్మ్స్ పతాకంపై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు. అదితి బాలన్, ఎడ్వర్డ్ సోనెన్‍బెక్, జాన్ కొక్కెన్, నివేదిక సతీశ్, వినోద్ కిషన్ కూడా ఈ మూవీలో కీలక పాత్రల్లో కనిపించారు.
కెప్టెన్ మిల్లర్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో తెలుగులో జనవరి 25న విడుదల కానుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది.