Captain Miller Telugu Release Date: ధనుష్ కెప్టెన్ మిల్లర్ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడొస్తుందంటే?-captain miller telugu release date announced dhanush movie to come a day before republic day ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Captain Miller Telugu Release Date: ధనుష్ కెప్టెన్ మిల్లర్ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడొస్తుందంటే?

Captain Miller Telugu Release Date: ధనుష్ కెప్టెన్ మిల్లర్ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడొస్తుందంటే?

Hari Prasad S HT Telugu
Jan 12, 2024 12:50 PM IST

Captain Miller Telugu Release Date: తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్ ను మేకర్స్ రివీల్ చేశారు. తమిళ వెర్షన్ శుక్రవారం (జనవరి 12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

కెప్టెన్ మిల్లర్ మూవీలో ధనుష్
కెప్టెన్ మిల్లర్ మూవీలో ధనుష్

Captain Miller Telugu Release Date: సంక్రాంతి రేసులో నిలిచి థియేటర్లు దొరక్క వెనక్కి వెళ్లిపోయిన ధనుష్ మూవీ కెప్టెన్ మిల్లర్ తెలుగు వెర్షన్ తాజా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా రిపబ్లిక్ డే కంటే ఒక రోజు ముందు అంటే జనవరి 25న తెలుగులో రిలీజ్ కాబోతోంది. తమిళ వెర్షన్ శుక్రవారమే (జనవరి 12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

నిజానికి తెలుగులోనూ కెప్టెన్ మిల్లర్ మూవీని సంక్రాంతికే రిలీజ్ చేయాలని భావించారు. అయితే ఇక్కడ ఇప్పటికే నాలుగు సినిమాలు ఉండటంతో ఈ సినిమాతోపాటు మరో తమిళ మూవీ అయలాన్ కూడా తెలుగు వెర్షన్ రిలీజ్ వాయిదా వేసుకున్నాయి. ఇక ఇప్పుడు ఏషియన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ కెప్టెన్ మిల్లర్ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి.

కెప్టెన్ ధనుష్ సూపర్..

అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా తమిళ వెర్షన్ శుక్రవారం రిలీజైంది. ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ముఖ్యంగా ధనుష్ నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. తమిళ ఇండస్ట్రీలో రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాతి స్థానం ధనుష్ దే అంటూ కొందరు ట్వీట్లు చేస్తున్నారు.

ఈ కెప్టెన్ మిల్లర్ తో అరుణ్ మాతేశ్వరన్ స్టోరీ టెల్లింగ్ ను మరో లెవల్ కు తీసుకెళ్లినట్లు కూడా రివ్యూలు వస్తున్నాయి. 1930లనాటి నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఇందులో అణగారిన వర్గానికి చెందిన అనలీశన్ అనే వ్యక్తి తర్వాత బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సిపాయిగా, తర్వాత కెప్టెన్ మిల్లర్ అనే డెకాయిట్ గా ఎలా మారాడన్నది చూపించారు.

కెప్టెన్ మిల్లర్ పాత్రలో ధనుష్ నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ధనుష్ తోపాటు ప్రియాంకా అరుల్ మోహన్, శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్, నివేదితా సతీష్ లాంటి వాళ్లు నటించారు. సత్య జ్యోతి ఫిల్సమ్ బ్యానర్ కింద సెంథిల్ త్యాగరాజ్, అరుణ్ త్యాగరాజన్ ఈ మూవీని తెరకెక్కించారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించాడు.

నిజానికి కెప్టెన్ మిల్లర్ మూవీని డిసెంబర్ 15నే రిలీజ్ చేయాలని భావించినా.. తర్వాత పొంగల్ సినిమాగా తీసుకురావాలని జనవరి 12న రిలీజ్ చేశారు. అయితే తెలుగులో థియేటర్లు దొరక్కపోవడంతో ఇక్కడ రిలీజ్ వాయిదా వేశారు. ఇక ఇప్పుడు జనవరి 25న తెలుగులోనూ వస్తుండటంతో ఇక్కడి ధనుష్ అభిమానులు మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక కెప్టెన్ మిల్లర్ మూవీ రెండు భాగాలుగా రావడం ఖాయమైందని సమాచారం బయటికి వచ్చింది. ఈ విషయంపై గతంలో సినీ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ ట్వీట్ చేశారు. ధనుశ్ నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ రెండు భాగాలుగా రావడం కన్‍ఫామ్ అయిందని పేర్కొన్నారు. గతంలో వచ్చిన కెప్టెన్ మిల్లర్ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‍గా ఉంది. సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది.

IPL_Entry_Point