Captain Miller Trailer: కెప్టెన్ మిల్లర్ ట్రైలర్: ధనుష్ నట విశ్వరూపం-captain miller trailer released dhanush once again shows versatility ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Captain Miller Trailer: కెప్టెన్ మిల్లర్ ట్రైలర్: ధనుష్ నట విశ్వరూపం

Captain Miller Trailer: కెప్టెన్ మిల్లర్ ట్రైలర్: ధనుష్ నట విశ్వరూపం

Jan 06, 2024, 08:41 PM IST Chatakonda Krishna Prakash
Jan 06, 2024, 08:41 PM , IST

Captain Miller Trailer: కెప్టెన్ మిల్లర్ సినిమా ట్రైలర్ వచ్చేసింది. ధనుష్ హీరోగా నటించిన ఈ మూవీ జనవరి 12వ తేదీన తమిళంలో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆ తర్వాత తెలుగులో కూడా రానుంది. కెప్టెన్ మిల్లర్ తమిళ ట్రైలర్ నేడు (జనవరి 6) వచ్చింది. ధనుష్ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపారు. వివరాలివే.. 

తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్ర పోషించిన కెప్టెన్ మిల్లర్ రిలీజ్‍కు రెడీ అయింది. జనవరి 12న ఈ చిత్రంలో తమిళంలో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్ నేడు (జనవరి 6) విడుదలైంది. 

(1 / 6)

‘కెప్టెన్ మిల్లర్’ ట్రైలర్‌లో మరోసారి నట విశ్వరూపం చూపారు ధనుష్. వివిధ గెటప్‍ల్లో కనిపించారు. యాక్షన్ సీన్లలో ఇంటెన్స్‌గా సత్తాచాటారు. బ్రిటీషర్లపై పోరాడే విప్లవకారుడిగా ఈ చిత్రంలో ధనుష్ నటించారు. 

(2 / 6)

భారత స్వాతంత్య్రానికి ముందు బ్రిటిషర్ల పాలనలో ఉండే బ్యాక్‍డ్రాప్‍లో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా కెప్టెన్ మిల్లర్ తెరకెక్కింది. బందిపోటు, క్రిమినల్‍గా ధనుష్‍ను పరిగణించి మట్టుబెట్టాలని బ్రిటీషర్లు దాడులు చేస్తుంటారు. వారిపై ధనుష్ తిరగబడతారు. తమ గ్రామాన్ని ఆక్రమించుకోవాలన్న బ్రిటీషర్లపై పోరాడతారు.  

(3 / 6)

కెప్టెన్ మిల్లర్ చిత్రానికి అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. 2 గంటల 54 నిమిషాల పాటు ఉన్న ట్రైలర్ ఆసాంతం ఆసక్తికరంగా సాగింది. 

(4 / 6)

కెప్టెన్ మిల్లర్ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్, కన్నడ స్టార్ శివ రాజ్‍కుమార్, తెలుగు నటుడు సందీప్ కిషన్, వినోద్ కిషన్, నాజర్, ఎడ్వర్డ్ సొనెన్‍బ్లిక్ కీలకపాత్రలు పోషించారు. 

(5 / 6)

తమిళం, కన్నడలో జనవరి 12వ తేదీనే కెప్టెన్ మిల్లర్ థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగులో సంక్రాంతికి చాలా సినిమాలు పోటీలో ఉన్నాయి. అందుకే, కొన్ని రోజుల తర్వాత తెలుగులో కెప్టెన్ మిల్లర్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

(6 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు