Kumari Aunty Food Point: ‘ఇది సరికాదు’: కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్‌ను బంద్ చేయించడంపై హీరో సందీప్ కిషన్-not fair at all says sundeep kishan on kumari aunty food point stoppage ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kumari Aunty Food Point: ‘ఇది సరికాదు’: కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్‌ను బంద్ చేయించడంపై హీరో సందీప్ కిషన్

Kumari Aunty Food Point: ‘ఇది సరికాదు’: కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్‌ను బంద్ చేయించడంపై హీరో సందీప్ కిషన్

Sundeep Kishan on Kumari Aunty Food Point: సోషల్ మీడియాలో ఇటీవల పాపులర్ అయిన ‘కుమారి ఆంటీ’ ఫుడ్ సెంటర్‌ను ట్రాఫిక్ పోలీసులు మూసేయించారు. దీంతో ఈ విషయంపై టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ స్పందించారు.

Kumari Aunty Food Point: కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్‌ను బంద్ చేయించడంపై స్పందించిన హీరో సందీప్ కిషన్

Kumari Aunty: సోషల్ మీడియాలో కొంతకాలంగా కుమారి ఆంటీ ఫుడ్ పాయింట్ వీడియోలు పాపులర్ అవుతున్నాయి. హైదరాబాద్‍లోని మాదాపూర్‌ ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా సాయి కుమారి అనే మహిళల రోడ్‍సైడ్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. అయితే, ఇటీవల ఓ వీడియో వల్ల ‘కమారి ఆంటీ’ ఫేమస్ అయ్యారు. దీంతో ఆ ఫుడ్ స్టాల్‍కు ఇటీవల రద్దీ పెరిగింది. చాలా మంది ఆ ఫుడ్ స్టాల్ వద్ద గుమికూడుతున్నారు. వీడియోలు తీసుకునేందుకు ఎగబడుతున్నారు. ఈ క్రమంలో కుమారి ఆంటీ ఫుడ్ పాయింట్‍ను ట్రాఫిక్ పోలీసులు నేడు బంద్ చేయించారు.

కుమారి అంటీ ఫుడ్ స్టాల్‍కు చాలా మంది వస్తుండటంతో ట్రాఫిక్ జామ్ అవుతోందని మూసేయించారు పోలీసులు. నేడు స్టాల్‍ను బంద్ చేయించారు. అయితే, పోలీసులు తమను షాప్ ఎందుకు తెరవనివ్వడం లేదో అర్థం కావడం లేదని కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్‌ను మూసివేయించడంపై టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ స్పందించారు.

ఊరు పేరు భైరవకోన’ సినిమా ప్రమోషన్లలో భాగంగా సందీప్ కిషన్‍తో పాటు మూవీ టీమ్ ఇటీవల కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్‌కు వెళ్లారు. అయితే, ఈలోగానే ఇలా జరగడంతో సందీప్ కిషన్ ట్వీట్ చేశారు. ఇది న్యాయం కాదని, ఆమెకు సాయం చేస్తానని పేర్కొన్నారు.

సాయం చేస్తాం

“ఇది అసలు న్యాయం కాదు. సొంతంగా వ్యాపారం ప్రారంభించి కుటుంబానికి మద్దతుగా నిలిచేందుకు చాలా మంది మహిళలకు ఆమె స్ఫూర్తిగా మారుతున్నారు. ఇటీవలి కాలంలో మహిళా సాధికారితకు నేను చూసిన ఉదాహరణ ఆమె. నేను, నా టీమ్ ఆమెతో మాట్లాడతాం. ఆమెకు వీలైనంత మేర సాయం చేస్తాం” అని సందీప్ కిషన్ ట్వీట్ చేశారు.

కుమారి ఆంటీ సుమారు 13ఏళ్లుగా మాదాపూర్‌లో ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. చాలా రకాల నాన్ వెజ్, వెజ్ వంటకాలను ఉంచుతున్నారు. ఫుడ్ రుచికరంగా ఉండటంతో ఆమె వ్యాపారం బాగా జరుగుతుండేది. అయితే, ఇటీవలే సోషల్ మీడియాలో ఫుడ్ స్టాల్‍కు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో జనాలతో పాటు సోషల్ మీడియా ఇన్‍ఫ్లయెన్సర్లు భారీగా అక్కడ చేరుతున్నారు. దీంతో ఇప్పుడు ఆమె వ్యాపారానికే ముప్పు ఏర్పడింది.

సోషల్ మీడియాలో పాపులర్ అవడంతో ఊరు పేరు భైరవకోన ప్రమోషన్లలో భాగంగా కుమారి ఆంటీ ఫుడ్‍ సెంటర్‌కు ఇటీవలే వెళ్లారు సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ. వారితో పాటు మూవీ టీమ్ సభ్యులు అక్కడ భోజనం చేశారు. ఫుడ్ బాగుందని సందీప్ చెప్పారు.

ఊరు పేరు భైరవకోన గురించి..

సందీప్ కిషన్ హీరోగా నటించిన ఊరు పేరు భైరవకోన చిత్రం ఫిబ్రవరి 16వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 9నే రావాల్సిన ఈ మూవీ.. ఈగల్ కోసం వారం ఆలస్యంగా వస్తోంది. సూపర్ నేచురల్ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీగా ఊరు పేరు భైరవకోనను దర్శకుడు వీ ఆనంద్ తెరకెక్కించారు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, వెన్నెల కిశోర్, వైవా హర్ష కీలకపాత్రలు చేశారు. శేఖర్ చంద్ర సంగీతం అందించారు.