Sundeep Kishan: ఆరోజు దెయ్యాలు భూతాలు మ్యాజిక్ చూస్తారు.. హీరో సందీప్ కిషన్ కామెంట్స్-sundeep kishan comments in ooru peru bhairavakona trailer launch ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sundeep Kishan: ఆరోజు దెయ్యాలు భూతాలు మ్యాజిక్ చూస్తారు.. హీరో సందీప్ కిషన్ కామెంట్స్

Sundeep Kishan: ఆరోజు దెయ్యాలు భూతాలు మ్యాజిక్ చూస్తారు.. హీరో సందీప్ కిషన్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Jan 19, 2024 01:07 PM IST

Sundeep Kishan About Ooru Peru Bhairavakona: యంగ్ హీరో సందీప్ కిషన్ లేటెస్ట్‌గా నటించిన సినిమా ఊరు పేరు భైరవకోన. సస్పెన్స్ అండ్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఊరు పేరు భైరవకోన మూవీ ట్రైలర్ ఈవెంట్‌లో సందీప్ కిషన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

ఆరోజు దెయ్యాలు భూతాలు మ్యాజిక్ చూస్తారు.. హీరో సందీప్ కిషన్ కామెంట్స్
ఆరోజు దెయ్యాలు భూతాలు మ్యాజిక్ చూస్తారు.. హీరో సందీప్ కిషన్ కామెంట్స్

Sundeep Kishan Ooru Peru Bhairavakona: హీరో సందీప్ కిషన్, ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ కాంబినేషన్‌లో ఫాంటసీ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కింది ఊరు పేరు భైరవకోన. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మించగా.. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే మొదటి రెండు పాటలు- నిజమే నే చెబుతున్నా, హమ్మా హమ్మా చార్ట్‌బస్టర్‌ హిట్స్‌ అయ్యాయి.

జనవరి 18న ఊరు పేరు భైరవకోన మూవీ ట్రైలర్‌ లాంచ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సందీప్ కిషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. "తెలుగు సినిమా ముద్దు బిడ్డ, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు గారి వర్ధంతి నేడు (జనవరి 18). ఆయన్ని స్మరిస్తూ మా ట్రైలర్‌ని లాంచ్ చేశాం. దర్శకుడు విఐ ఆనంద్ గారు అనుకున్న ప్రాజెక్ట్ అనుకున్నట్లుగా, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని దాదాపు రెండున్నరేళ్లు ఈ చిత్రం కోసం ఒక బాధ్యతతో పని చేశాం" అని సందీప్ కిషన్ అన్నాడు.

"ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే బాధ్యత ఎంత ఉందో అంతకంత నిర్మాత అనిల్ సుంకర గారికి, రాజాకి, నాకు, సినిమాలో పని చేసి అందరికీ ఈ చిత్రం పెద్ద విజయం సాధించడం మా అందరికీ చాలా అవసరం. ఆ బాధ్యతని అవసరాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ పని చేశాం. ఇందులో నిజమేనే చెబుతున్నా పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. దీనికి పూర్తి కారణం ప్రేక్షకుల ఆదరణ. చాలా గొప్పగా ఆదరించారు" అని సందీప్ కిషన్ థ్యాంక్స్ చెప్పాడు.

"ఫిబ్రవరి 9న దెయ్యాలు, భూతాలు, మ్యాజిక్కు, మంచి హ్యుమర్, పాటలు, బోలెడంత యాక్షన్ ఉన్న చిత్రాన్ని ప్రేక్షకులు చూడబోతున్నారు. ఊరు పేరు భైరవకోన కమర్షియల్లీ ప్యాకేజ్డ్ ఎంటర్ టైనర్. ఫిబ్రవరి 9న సినిమా థియేటర్స్‌లోకి వస్తుంది. తప్పకుండాఅందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది'' అని సందీప్ కిషన్ చెప్పుకొచ్చాడు. అలా దెయ్యాలు, భూతాలు, మ్యాజిక్‌ను ఫిబ్రవరి 9న థియేటర్‌లో ఊరు పేరు భైరవకోన సినిమా ద్వారా ఆస్వాదిస్తారని సందీప్ కిషన్ తెలిపాడు.

"ఊరు పేరు భైరవకోన నా కెరీర్ లో ఛాలెజింగ్ ప్రాజెక్ట్. ప్రతి సినిమాతో ప్రేక్షకులు డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని కోరుకుంటాను. ప్రేక్షకులు వారి జీవితంలో రెండున్న గంటలు సమయాన్ని కేటాయించి ఒక సినిమా చూస్తారు. వారి సమయానికి విలువ ఇవ్వాలని కోరుకుంటాను. దానికి తగిన కష్టం పడాలి. కథ స్క్రీన్ ప్లే కొత్త కంటెంట్ ప్రయత్నించాలి. ఆడియన్స్‌కి కొత్త అనుభూతి ఇవ్వాలనేది నా భాద్యత. ఊరు పేరు భైరవకోన ఆడియన్స్ కొత్త అనుభూతిని, ఎగ్జయిట్‌మెంట్ ఇస్తుంది" అని డైరెక్టర్ వీఐ ఆనంద్ తెలిపారు.

"సందీప్ నేను కలసి జర్నీ మొదలుపెట్టాం. మాకు సపోర్ట్ ఇచ్చిన అనిల్ గారికి రాజా గారికి కిశోర్ గారికి ధన్యవాదాలు. ఇలాంటి నిర్మాతలు దొరకడం నా అదృష్టం. సినిమాలో పని చేసిన నటీనటులు, టెక్నికల్, డైరెక్షన్ టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ చాలా అద్భుతంగా నటించారు. వీరితో పాటు చాలా మంచి స్టార్ కాస్ట్ ఉంది. ఈ చిత్రం ఖచ్చితంగా ఆడియన్స్‌కి సరికొత్త అనుభూతిని ఇస్తుంది" అని వీఐ ఆనంద్ పేర్కొన్నాడు.

 

Whats_app_banner