Ooru Peru Bhairavakona Trailer: గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన.. అదిరిపోయిన ట్రైలర్-ooru peru bhairavakona trailer released sundeep kishan fantasy thriller to come soon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ooru Peru Bhairavakona Trailer: గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన.. అదిరిపోయిన ట్రైలర్

Ooru Peru Bhairavakona Trailer: గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన.. అదిరిపోయిన ట్రైలర్

Hari Prasad S HT Telugu

Ooru Peru Bhairavakona Trailer: గరుడ పురాణంలో కనిపించకుండా పోయిన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన అంటూ ఊరు పేరు భైరవకోన మూవీ ట్రైలర్ రిలీజైంది. సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ జంటగా విఐ ఆనంద్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది.

ఊరు పేరు భైరవకోన మూవీలో సందీప్ కిషన్

Ooru Peru Bhairavakona Trailer: ఊరు పేరు భైరవకోన మూవీ ట్రైలర్ గురువారం (జనవరి 18) రిలీజైంది. 2015లో వచ్చిన 'టైగర్' సినిమా తర్వాత దర్శకుడు వి.ఐ.ఆనంద్, నటుడు సందీప్ కిషన్ కాంబినేషన్లో ఈ ఫాంటసీ థ్రిల్లర్ తెరకెక్కుతోంది.

ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఊరు పేరు భైరవకోన ట్రైలర్ ను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. ఈ చిత్రంలోని “నిజమే నే చెబుతున్నా” అనే పాట ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఒక్క పాటతో మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగాయి. ఇప్పుడు ట్రైలర్ ఆ అంచనాలను మరో లెవల్ కు తీసుకెళ్లింది.

ఊరు పేరు భైరవకోన ట్రైలర్

వర్ష బొల్లమ్మపై సందీప్ పాత్ర తన భావాలను వర్ణించడంతో ట్రైలర్ మొదలవుతుంది. బ్యాక్ గ్రౌండ్లో నిజమే నే చెబుతున్నా సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. కనులతో చూసేది కొంచెమే.. గుండెల్లో లోతే కనిపించెలె.. పైపైన రూపాలు కాదులే.. లోలోన ప్రేమ చూడాలిలే అంటూ సందీప్ కిషన్ కవిత రూపంలో వర్ణిస్తాడు.

అప్పటి వరకూ రొమాంటిక్ గా కనిపించే ట్రైలర్ సడెన్ గా రూటు మారుతుంది. గరుడ పురాణంలో కనిపించకుండా పోయిన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన అనే డైలాగుతో ట్రైలర్ మొత్తం ఓ కొత్త దారిలో వెళ్తుంది. ఆ డైలాగుతో అసలు భైరవకోన మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది.

తన ప్రేమ కోసం ఏమి చేయడానికైనా సిద్ధపడే పాత్రలో ఈ మూవీలో సందీప్ కిషన్ కనిపించాడు. ఈ ట్రైలర్ లో అసలు సినిమా స్టోరీ ఏంటన్నది పూర్తిగా తేలలేదు. కాకపోతే థ్రిల్ ను పంచే ఎన్నో అంశాలు సినిమాలో ఉండబోతున్నట్లు మాత్రం ఈ ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ఈ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

'ఊరు పేరు భైరవకోన' చిత్రానికి భాను భోగవరపు, నందు సవిరిగన మాటలు రాశారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని రాజ్ తోట, సంగీతాన్ని శేఖర్ చంద్ర, ఎడిటింగ్ ఛోటా కె.ప్రసాద్, ఎ.రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశాడు. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ నటించిన ఈగల్ మూవీ కూడా అదే రోజు రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈగల్ మూవీని సోలో రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తామని ఫిల్మ్ ఛాంబర్ మాట ఇచ్చినా.. ఊరు పేరు భైరవకోన ప్రొడ్యూసర్లు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఫిబ్రవరి 9నే రిలీజ్ చేస్తామని స్పష్టం చేశాడు.

సందీప్ కొత్త పాత్రలో..

2023లో మైఖేల్ చిత్రంతో సందీప్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సంక్రాంతికి తమిళంలో విడుదలైన ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ మూవీలోనూ అతడు కీలక పాత్రలో కనిపించాడు. ఈ మూవీ తెలుగు వెర్షన్ జనవరి 25న విడుదల కానుంది. ఇక తర్వాత నిత్యామీనన్, ఎస్.జె.సూర్య, కాళిదాస్ జయరామ్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు నటించిన #D50 కోసం ధనుష్ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు.