Ooru Peru Bhairavakona Teaser: గరుడ పురాణంలో 4 పేజీలు మాయం? మిస్టరీ థ్రిల్లర్‌తో రానున్న సందీప్-sundeep kishan starred ooru peru bhairavakona teaser relased ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ooru Peru Bhairavakona Teaser: గరుడ పురాణంలో 4 పేజీలు మాయం? మిస్టరీ థ్రిల్లర్‌తో రానున్న సందీప్

Ooru Peru Bhairavakona Teaser: గరుడ పురాణంలో 4 పేజీలు మాయం? మిస్టరీ థ్రిల్లర్‌తో రానున్న సందీప్

Maragani Govardhan HT Telugu
Jan 08, 2024 06:50 PM IST

Ooru Peru Bhairavakona Teaser: సందీప్ కిషన్ నటిస్తున్న సరికొత్త చిత్రం ఊరు భైరవకొన. ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది.

ఊరు పేరు భైరవకొన టీజర్ విడుదల
ఊరు పేరు భైరవకొన టీజర్ విడుదల

Ooru Peru Bhairavakona Teaser: టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఈ ఏడాది మైఖేల్ అనే పాన్ ఇండియా చిత్రంతో సందడి చేశాడు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. దీంతో సందీప్ తన తదుపరి మూవీస్‌పై దృష్టిపెట్టాడు. ప్రస్తుతం అతడి నటిస్తున్న సరికొత్త చిత్రం ఊరు పేరు భైరవకొన. ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం నాడు సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా మూవీకి సంబంధించి ఆసక్తికర అప్డేట్‌ను విడుదల చేశారు. ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు.

ఊరు పేరు భైరవకొన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. శ్రీ కృష్ణదేవరాయల కాలంలో చలామణీలో ఉన్న గరుడ పురాణానికి ఇప్పటి గరుడపురాణానికి నాలుగు పేజీలు తగ్గాయి అనే వాయిస్ ఓవర్‌తో టీజర్‌ ప్రారంభమవుతుంది. ఈ ఊరిలోకి రావడమే కానీ.. బయటకు పోయే దారే లేదు అనే డైలాగ్‌తో ఆకట్టుకుంటుంది. గరుడ పురాణంలో మాయమైపోయిన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకొన అని సందీప్ వాయిస్ ఓవర్‌తో మరింత ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది.

సినిమా మొత్తం విజువల్ వండర్‌గా ఉంటుందని ఈ టీజర్ చూస్తేనే తెలుస్తోంది. కేవలం నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్‌లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయి. మిస్టరీ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి.

వీఐ ఆనంద్‌తో కలిసి సందీప్ కిషన్ గతంలో టైగర్ అనే సినిమా చేశారు. ఆ సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ దర్శకుడు తెరకెక్కించిన ఎక్కడికి పోతావు చిన్నవాడ, డిస్కో రాజా లాంటి హిట్ సినిమాలను తెరకెక్కించారు. దీంతో ఈ మూవీపై బజ్ ఏర్పడింది.

ఏకే ఎంటర్టైన్మెంట్, హాస్యా మూవీస్ పతాకాలపై రాజేశ్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిల్ సుంకర సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ కిషన్ సరసన కావ్యా థాపర్ హీరోయిన్‌గా చేస్తోంది. వర్ష బొల్లమ్మ, వెన్నెల కిషోర్, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్ చంద్ర ఈ మూవీకి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

టాపిక్