Malayalam Dubbing Movies: తెలుగులో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మలయాళ డబ్బింగ్ మూవీ ఇదే - లవ్ స్టోరీదే రికార్డ్
Malayalam Dubbing Movies: ప్రేమలు మూవీ తెలుగులో కొత్త రికార్డును నెలకొల్పింది. టాలీవుడ్ రిలీజైన మలయాళం డబ్బింగ్ మూవీస్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది.
Malayalam Dubbing Movies: ప్రేమలు మూవీ డబ్బింగ్ వెర్షన్ తెలుగులో మరో కొత్త రికార్డును నెలకొల్పింది. టాలీవుడ్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మలయాళం డబ్బింగ్ మూవీగా నిలిచింది. ప్రేమలు రిలీజ్‌కు ముందు టోవినో థామస్ 2018 మూవీ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. గత ఏడాది థియేటర్లలో రిలీజైన ఈ డబ్బింగ్ మూవీ తెలుగులో 10.85 కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకున్నది.
2018 మూవీని తెలుగులో అల్లు అరవింద్‌తో కలిసి బన్నీవాస్ రిలీజ్ చేశాడు. కోటి రూపాయల బ్రేక్ ఈవెన్‌తో రిలీజైన ఈ మూవీ నిర్మాతలకు పదింతల లాభాలను తెచ్చిపెట్టింది. తాజాగా 2018 రికార్డును ప్రేమలు అధిగమించింది.
పద్దెనిమిది రోజుల్లో 12 కోట్లు...
ప్రేమలు మూవీ తెలుగు వెర్షన్ మార్చి 8న థియేటర్లలో విడుదలైంది. పద్దెనిమిది రోజుల్లోనే ఈ డబ్బింగ్ వెర్షన్ 12 కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. ఫస్ట్ డే కోటి రూపాయల లోపే వసూళ్లను ఈ మూవీ రాబట్టింది. మౌత్ టాక్ బాగుండటంతో రోజురోజుకు వసూళ్లు పెరుగుతూ వచ్చాయి.
తాజాగా తెలుగులో మోహన్‌లాల్, మమ్ముట్టి లాంటి స్టార్ హీరోల సినిమాలకు సాధ్యం కానీ సెన్సేషనల్ రికార్డును సృష్టించింది. తెలుగులో డబ్ అయిన మలయాళం సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ లిస్ట్‌లో దాదాపు పది కోట్ల కలెక్షన్స్‌తో మూడో స్థానంలో మోహన్‌లాల్ మన్యం పులి ఉంది.
రాజమౌళి తనయుడు...
ప్రేమలు సినిమాను తెలుగులో దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశాడు. ఈ సినిమాతోనే డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ మూవీతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు.
మూడు కోట్ల బడ్జెట్...130 కోట్ల కలెక్షన్స్...
ప్రేమలు సినిమాను మలయాళంలో స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ తన స్నేహితులతో కలిసి నిర్మించాడు. మూడు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ 130 కోట్లకుపైగా వసూళ్లను సొంతం చేసుకున్నది. మంజుమ్మెల్ బాయ్స్ తర్వాత ఈ ఏడాది మలయాళంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన రెండో మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.
హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో...
ప్రేమలు సినిమాలో నస్లేన్, మమతా బైజు హీరోహీరోయిన్లుగా నటించారు. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు గిరీష్ ఏడీ ఈ మూవీ మలయాళం మూవీని తెరకెక్కించాడు. హైదరాబాద్‌లో గేట్ కోచింగ్ తీసుకోవడానికి వస్తాడు సచిన్. సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే రీనూతో ప్రేమలో పడతాడు. రీనూను ఆమె కోలిగ్ ఆది కూడా ఇష్టపడుతుంటాడు.
ఈ ట్రాయాంగిల్ లవ్‌స్టోరీ చివరకు ఏ మలుపులు తిరిగింది? పలుమార్లు లవ్‌లో ఫెయిలైన సచిన్...రీనూ ప్రేమను ఎలా నిలబెట్టుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ. ఈ సినిమాలో తన క్యూట్ యాక్టింగ్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నది మమితా బైజు. ప్రేమలుతో ఓవర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయింది. ప్రేమలు బ్లాక్‌బస్టర్‌తో మమితా బైజుకు తెలుగు, తమిళ భాషల నుంచి ఆఫర్లు క్యూ కడుతోన్నాయి.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో...
ప్రేమలు మూవీ ఈ వారంలోనే ఓటీటీలోకి రాబోతోంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ద్వారా ఈ లవ్‌స్టోరీ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. దక్షిణాదితో పాటు హిందీ భాషలోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.