Premalu OTT Release: మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ ప్రేమ‌లు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌- తెలుగులోనూ స్ట్రీమింగ్-premalu ott release date mamitha baiju malayalam blockbuster to premiere on disney plus hotstar from this date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Premalu Ott Release: మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ ప్రేమ‌లు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌- తెలుగులోనూ స్ట్రీమింగ్

Premalu OTT Release: మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ ప్రేమ‌లు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌- తెలుగులోనూ స్ట్రీమింగ్

Nelki Naresh Kumar HT Telugu
Mar 14, 2024 10:10 AM IST

Premalu OTT Release: మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ప్రేమ‌లు ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది మార్చి 29 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

ప్రేమ‌లు ఓటీటీ రిలీజ్ డేట్‌
ప్రేమ‌లు ఓటీటీ రిలీజ్ డేట్‌

Premalu OTT Release: యూత్‌ఫుల్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ప్రేమ‌లు మూవీ మ‌ల‌యాళంలో వంద కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి రికార్డులు సృష్టించింది. థియేట‌ర్ల‌లో రిలీజై నెల రోజులు దాటినా మ‌ల‌యాళంలో ఈ మూవీ ప్ర‌భంజ‌నం కొన‌సాగుతూనే ఉంది.

ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి గిరీష్ ఏడీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. న‌స్లీన్‌, మ‌మితా బైజు హీరోహీరోయిన్లుగా న‌టించారు. థియేట‌ర్ల‌లో కాసుల వ‌ర్షం కురిపిస్తోన్న ఈ మూవీ త్వ‌ర‌లో ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు స‌మాచారం.

డిస్నీ హాట్ స్టార్‌లో...

ప్రేమ‌లు మూవీ డిజిట‌ల్ హ‌క్కుల‌ను డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్న‌ది. మార్చి 29 నుంచి ఈ యూత్‌ఫుల్ ల‌వ్‌స్టోరీ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు స‌మాచారం. మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ప్రేమ‌లు రిలీజ్ కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

తొలుత ఈ సినిమాను మార్చి ఫ‌స్ట్ వీక్‌లోనే ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని డిస్నీ హాట్‌స్టార్ ప్లాన్ చేసింది. ప్రేమ‌లు తెలుగు వెర్ష‌న్ మార్చి 8న థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. త‌మిళ వెర్ష‌న్ మార్చి 15న రిలీజ్ అవుతోంది. అందువ‌ల్లే ఓటీటీ రిలీజ్ డిలే అయిన‌ట్లు చెబుతోన్నారు.

తెలుగులో రాజ‌మౌళి త‌న‌యుడు...

ప్రేమ‌లు తెలుగు వెర్ష‌న్‌ను దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ రిలీజ్ చేశారు. ఏడు రోజుల్లో ఈ మూవీ ఐదు కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ డ‌బ్బింగ్ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో రాజ‌మౌళి పాల్గొన‌డం ప్ల‌స్స‌యింది. కార్తికేయ‌కు ఈ సినిమా మంచి లాభాల‌ను తెచ్చిపెట్టింది.

మ‌ల‌యాళంలో ప‌ది కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ వంద కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. మ‌ల‌యాళ సినీ చ‌రిత్ర‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన టాప్ ఫైవ్ సినిమాల్లో ఒక‌టిగా నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రేమ‌లు సినిమాలో శ్యామ్ మోహ‌న్ సంగీత్ ప్ర‌తాప్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

ప్రేమ‌లు క‌థ ఇదే...

ప్రేమ‌లు సినిమాను హైద‌రాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు గిరీష్‌. స‌చిన్ ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లాల‌ని క‌ల‌లు కంటాడు. కానీ వీసా రిజెక్ట్ కావ‌డంతో గేట్ కోచింగ్ కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. ఓ వేడుక‌లో అత‌డికి రీనూ ప‌రిచ‌యం అవుతుంది. సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే రీనూతో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు స‌చిన్‌.

అప్ప‌టికే ల‌వ్‌లో ఓ సారి ఫెయిలైన స‌చిన్‌...రీనుకు త‌న ప్రేమ‌ను ఎలా చెప్పాడు? రీనును ప్రేమిస్తోన్న ఆది ఎవ‌రు? భిన్న మ‌న‌స్త‌త్వాలు, ఆలోచ‌న‌లు క‌లిగిన స‌చిన్‌, రీనూ చివ‌ర‌కు ఒక్క‌ట‌య్యారా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌. ప్రేమ‌లు సినిమాకు మ‌ల‌యాళ స్టార్ హీరో ఫ‌హాద్ ఫాజిల్ ఓ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు. త‌న స్నేహితుల‌తో క‌లిసి ఈ చిన్న సినిమాను నిర్మించాడు.

మూడు హిట్స్‌...

ఈ ఏడాది మ‌ల‌యాళ మూవీస్ అద‌ర‌గొడుతోన్నాయి. ప్రేమ‌లుతో పాటు గ‌త ఫిబ్ర‌వ‌రిలో రిలీజైన మంజుమ్మేల్ బాయ్స్ 175 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. మ‌మ్ముట్టి భ్ర‌మ‌యుగం సినిమా కూడా యాభై కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో మ‌ల‌యాళం సినిమాలు సినీ ల‌వ‌ర్స్ దృష్టిని ఆక‌ర్షిస్తోన్నాయి.