True Lover OTT Release: ట్రూ లవర్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?
True Lover OTT Release: మణికందన్, శ్రీ గౌరిప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన ట్రూ లవర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. మార్చ 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.
True Lover OTT Release: ట్రూ లవర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్‌గా కన్ఫామ్ అయ్యింది. ఈ లవ్ స్టోరీ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. మార్చి 27న తమిళం, తెలుగుతో పాటు ఇతర భాషల్లో ట్రూ లవర్ రిలీజ్ కాబోతోంది. ట్రూ లవర్ సినిమాలో మణికందన్, శ్రీగౌరిప్రియ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ ప్రేమకథా చిత్రానికి ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించాడు.
తమిళ్ మూవీ డబ్బింగ్...
లవర్ పేరుతో తమిళంలో తెరకెక్కిన ఈ మూవీని ట్రూ లవర్ పేరుతో డైరెక్టర్ మారుతి, బేబీ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ తెలుగులో రిలీజ్ చేశారు. ఈ ఏడాది తమిళంలో చిన్న సినిమాల్లో మంచి లాభాలను రాబట్టిన మూవీగా లవర్ నిలిచింది. థియేటర్లలో 25 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. తెలుగులో టీజర్, ట్రైలర్స్‌తో ట్రూ లవర్ మూవీ ఆడియెన్స్‌లో ఆసక్తిని రేకెత్తించింది. ఓపెనింగ్స్ బాగానే వచ్చిన అదే టైమ్‌లో రవితేజ ఈగల్, రజనీకాంత్ లాల్‌సలామ్ రిలీజ్ కావడంతో ఈ సినిమా కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ పడింది. తెలుగు వెర్షన్ మొత్తం రెండు కోట్ల లోపే కలెక్షన్స్ రాబట్టింది.
ట్రూ లవర్ కథ ఇదే...
ప్రేమ విషయంలో యువతరం ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉంటున్నాయనే పాయింట్‌తో దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ ట్రూ లవర్ మూవీని తెరకెక్కించాడు.అరుణ్ ను (మణికందన్) ప్రాణంగా ప్రేమిస్తుంది దివ్య (శ్రీగౌరిప్రియ) . కానీ ప్రతి విషయంలో దివ్యను అనుమానిస్తుంటాడు అరుణ్. ఆమె మరొకరితో క్లోజ్‌గా మాట్లాడినా సహించలేడు. అరుణ్ అనుమానాలు, ప్రవర్తనతో విసిగిపోయిన దివ్య అతడికి బ్రేకప్ చెప్పాలని చాలా సార్లు అనుకుంటుంది. కానీ అరుణ్ క్షమాపణలు చెప్పగానే కరిగిపోతుంది
దివ్య తన ఫ్రెండ్స్‌తో కలిసిఓ టూర్‌కు వెళుతుంది. అనుకోని పరిస్థితుల్లో ఆమె వెంట అరుణ్ కూడా టూర్ వస్తాడు. అక్కడ ఏమైంది? అరుణ్‌లో మార్పు వచ్చిందా? దివ్య ప్రేమను అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ. అపనమ్మకంతో కూడిన ప్రేమ ఎల్లకాలం నిలబడదనే పాయింట్‌తో దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ ట్రూ లవర్ సినిమాను తెరకెక్కించాడు.
శ్రీ గౌరిప్రియ తెలుగు హీరోయిన్...
ట్రూ లవర్‌లో నటించిన శ్రీ గౌరిప్రియ తెలుగు హీరోయిన్‌గా కావడం గమనార్హం. తెలుగులో వైజయంతి మూవీస్ బ్యానర్‌లో వచ్చిన మెయిల్ సినిమాతో యాక్టింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీ గౌరిప్రియ. గత ఏడాది రిలీజైన మ్యాడ్ మూవీతో పాటు రైటర్ పద్మభూషణ్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించి సక్సెస్‌లను అందుకున్నది. ట్రూ లవర్ కంటే ముందు తమిళంలో మోడ్రన్ లవ్ ఇన్ చెన్నై అనే వెబ్‌సిరీస్ చేసింది శ్రీ గౌరిప్రియ.
సైతాన్ వెబ్‌సిరీస్‌లో...
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన మణికందన్ జైభీమ్‌తో పాలు పలు సినిమాల్లో కీలక పాత్రలు చేశాడు. గుడ్‌నైట్ మూవీ హీరోగా అతడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. గురక సమస్య నేపథ్యంలో కామెడీ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన గుడ్‌నైట్ మూవీ 2023లో తమిళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. తెలుగులో మహి వి రాఘవ్ రూపొందించిన సైతాన్ వెబ్‌సిరీస్‌లో నక్సలైట్ పాత్రలో మణికందన్ కనిపించాడు.
టాపిక్