Friday OTT Releases: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే-friday ott releases bramayugam save the tigers 2 murder mubarak mix up in netflix sonyliv disney plus hotstar aha otts ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Friday Ott Releases Bramayugam Save The Tigers 2 Murder Mubarak Mix Up In Netflix Sonyliv Disney Plus Hotstar Aha Otts

Friday OTT Releases: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

Hari Prasad S HT Telugu
Mar 13, 2024 11:00 AM IST

Friday OTT Releases: రాబోయే శుక్రవారం (మార్చి 15) ఓటీటీల్లోకి కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. వీటిలో భ్రమయుగం, సేవ్ ద టైగర్స్ సీజన్ 2, మిక్సప్, మర్డర్ ముబారక్ లాంటివి ఉన్నాయి.

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

Friday OTT Releases: ఓటీటీల్లోకి ప్రతి వారంలాగే ఈ శుక్రవారం (మార్చి 15) కూడా చాలా సినిమాలు, వెబ్ సిరీస్ వస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్, సోనీలివ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఆహా, ప్రైమ్ వీడియోలాంటి ఓటీటీల్లో వీటిని చూడొచ్చు. అంతేకాదు గురు, శనివారాల్లోనూ ఈవారం కొన్ని సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. ఆ సినిమాలు, వెబ్ సిరీస్ ఏవో ఒకసారి చూద్దాం.

భ్రమయుగం - సోనీలివ్

మలయాళంలో ఈ ఏడాది రిలీజైన సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో భ్రమయుగం ఒకటి. మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ఈ భ్రమయుగం మూవీ శుక్రవారం (మార్చి 15) నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

సేవ్ ద టైగర్స్ సీజన్ 2 - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

సేవ్ ద టైగర్స్ తొలి సీజన్ కు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో మనం చూశాం. ఇప్పుడీ కామెడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఈ శుక్రవారం నుంచి రెండో సీజన్ స్ట్రీమింగ్ అవుతుంది.

మిక్సప్ - ఆహా ఓటీటీ

ఆహా ఓటీటీలో ఈ వారం ఓ బోల్డ్ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా పేరు మిక్సప్. ఈకాలం రిలేషన్షిప్ లు ఎలా ఉంటాయో కళ్లకు కట్టే ఈ సినిమాలో కమల్ కామరాజు, ఆదర్శ్ బాలకృష్ణ, అక్షర గౌడ, పూజా జవేరీ నటించారు. మిక్సప్ శుక్రవారం నుంచి ఆహా ఓటీటీలోకి వస్తుంది.

మర్డర్ ముబారక్ - నెట్‌ఫ్లిక్స్

నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతున్న మరో మర్డర్ మిస్టరీ మూవీ మర్డర్ ముబారక్. బాలీవుడ్ కు చెందిన కరిష్మా కపూర్, సంజయ్ కపూర్, సారా అలీ ఖాన్, విజయ్ వర్మలాంటి వాళ్లు నటించిన ఈ సినిమా శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఢిల్లీలోని ఓ క్లబ్ లో జరిగే హత్య చుట్టూ తిరిగే స్టోరీ ఇది.

టేలర్ స్విఫ్ట్: ది ఎరాస్ టూర్ - హాట్‌స్టార్

ప్రముఖ సింగర్ టేలర్ స్విఫ్ట్ ఎరాస్ టూర్ పై రూపొందించిన కాన్సర్ట్ ఫిల్మ్ ఇది. సామ్ రెంచ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ శుక్రవారం నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కు రానుంది.

గురు, శనివారాల్లో రాబోతున్న సినిమాలు

ఇక శుక్రవారమే కాదు.. అంతకుముందు గురువారం (మార్చి 14), శనివారం (మార్చ 16) కూడా కొన్ని సినిమాలు ఓటీటీల్లోకి వస్తున్నాయి. అవేంటో చూద్దాం.

మై అటల్ హు - జీ5

మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మై అటల్ హు మూవీ గురువారం (మార్చి 14) నుంచే జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుంది. ఈ మూవీలో వాజపేయి పాత్రను ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠీ పోషించాడు. థియేటర్లలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

హనుమాన్ - కలర్స్ సినీప్లెక్స్, జియో సినిమా

ఇక హనుమాన్ మూవీ హిందీ వెర్షన్ శనివారం (మార్చి 16) జియో సినిమాలో రాబోతోంది. ఈ మూవీ గత శుక్రవారం (మార్చి 8) జీ5లో వస్తుందని భావించినా.. తీవ్ర నిరాశే ఎదురైంది. అయితే ఇప్పుడు శనివారం రోజు కలర్స్ సినీప్లెక్స్ ఛానెల్ తోపాటు జియో సినిమాలో హనుమాన్ హిందీ వెర్షన్ మూవీ రాబోతోంది.

IPL_Entry_Point