Kerala Government OTT: ఇండియా ఫ‌స్ట్ గ‌వ‌ర్న‌మెంట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ లాంఛ్ - 75 రూపాయ‌ల‌కే మ‌ల‌యాళం మూవీస్ స్ట్రీమింగ్‌-c space ott indias first government ott platform launched by kerala state ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kerala Government Ott: ఇండియా ఫ‌స్ట్ గ‌వ‌ర్న‌మెంట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ లాంఛ్ - 75 రూపాయ‌ల‌కే మ‌ల‌యాళం మూవీస్ స్ట్రీమింగ్‌

Kerala Government OTT: ఇండియా ఫ‌స్ట్ గ‌వ‌ర్న‌మెంట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ లాంఛ్ - 75 రూపాయ‌ల‌కే మ‌ల‌యాళం మూవీస్ స్ట్రీమింగ్‌

Nelki Naresh Kumar HT Telugu
Mar 08, 2024 12:56 PM IST

Kerala Government OTT: దేశంలోనే తొలి ప్ర‌భుత్వ ఓటీటీ యాప్‌ను కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ ఇటీవ‌ల ప్రారంభించారు. ఈ ఓటీటీ యాప్‌లో మ‌ల‌యాళం భాష‌కు చెందిన అవార్డ్ విన్నింగ్ సినిమాల‌ను వీక్షించ‌వ‌చ్చు.

కేర‌ళ గ‌వ‌ర్న‌మెంట్ ఓటీటీ
కేర‌ళ గ‌వ‌ర్న‌మెంట్ ఓటీటీ

Kerala Government OTT: ప్ర‌స్తుతం ఇండియాలో ఉన్న ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అన్ని కార్పొరేట్ సంస్థ‌ల ఆధ్వ‌ర్యంలోనే న‌డుస్తోన్నాయి. వాల్డ్ డిస్నీ, రిల‌య‌న్స్ వంటి దిగ్గ‌జ సంస్థ‌లు ఈ ఓటీటీ యాప్స్‌ను ర‌న్ చేస్తున్నాయి. అయితే ఫ‌స్ట్ టైమ్ ఇండియాలో కేర‌ళ ప్ర‌భుత్వం సొంతంగా ఓ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను లాంఛ్ చేసింది.

సీస్పేస్‌...

సీస్పేస్ పేరుతో ప్రారంభ‌మైన ఈ ఓటీటీ యాప్‌ను కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ ఇటీవ‌ల ప్రారంభించారు. సీస్పేస్ ఓటీటీ యాప్ నిర్వ‌హ‌ణ‌ బాధ్య‌త‌ల్ని కేర‌ళ స్టేట్ ఫిలిం డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చేప‌ట్టింది. ఇందులోని కంటెంట్‌, సినిమాల స్ట్రీమింగ్‌, రిలీజ్‌కు సంబంధించిన అంశాల‌ను కేర‌ళ క‌ల్చ‌ర‌ల్ మినిస్ట్రీ చూసుకోనున్న‌ట్లు స‌మాచారం. ఈ యాప్ నిర్వ‌హ‌ణ కోసం 60 మందితో కూడిన స్పెష‌ల్ బోర్డ్‌ను ప్ర‌భుత్వం ఏర్పాటుచేసిన‌ట్లు తెలిసింది. ఇందులో ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ సంతోష్ శివ‌న్‌తో పాటు స‌న్నీ జోసెఫ్‌, ఓవీ ఉషా, బెన్యామీన్ బోర్డ్ మెంబ‌ర్స్‌గా సెలెక్ట్ అయ్యిన‌ట్లు తెలిసింది.

మ‌ల‌యాళ సినిమాలు...

సీస్పేస్ ఓటీటీ యాప్ మ‌ల‌యాళ సినిమాల‌తో పాటు షార్ట్ ఫిలింస్‌, వెబ్‌సిరీస్‌లు, డాక్యుమెంట‌రీలు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది. కంప్లీట్‌గా ఈ ఓటీటీ యాప్ పే ఫ‌ర్ వ్యూ విధానంలో ర‌న్ అవుతుంద‌ని స‌మాచారం. ఈ ఓటీటీలో రిలీజైన సినిమాను చూడాలంటే యూజ‌ర్లు 75 రూపాయ‌లు చెల్లించాల‌ని ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. కేర‌ళ‌కు చెందిన ప్రేక్ష‌కులే కాకుండా దేశం మొత్తంలో ఎవ‌రైన ఈ ఓటీటీ యాప్ లో సినిమాలు చూడొచ్చ‌ని ప్ర‌భుత్వం తెలిపింది.

రెవెన్యూ డీటెయిల్స్‌...

అంతే కాకుండా ఈ ఓటీటీ యాప్ ద్వారా ఫిలిం మేక‌ర్స్‌కు ఎంత డ‌బ్బులు వ‌చ్చాయ‌నే స‌మాచారాన్ని కూడా ఇందులో అఫీషియ‌ల్‌గా పొందుప‌ర‌చ‌బోతున్న‌ట్లు తెలిసింది.

35 సినిమాలు…

ప్ర‌స్తుతం సీ స్పేస్ ఓటీటీ యాప్‌లో 35 సినిమాల‌తో పాటు ఆరు డాక్యుమెంట‌రీలో, ఓ షార్ట్ ఫిలిమ్‌ను ప్ర‌భుత్వం రిలీజ్ చేసింది. ఇందులో చాలా వ‌ర‌కు నేష‌న‌ల్‌, స్టేట్ అవార్డులు గెలుచుకున్న సినిమాల‌కే అవ‌కాశం ఇచ్చారు. ఇత‌ర ఓటీటీల‌లో లేని సినిమాల‌ను స్క్రీనింగ్ కోసం ఉంచారు.

అవార్డ్ విన్నింగ్ మూవీస్…

నిషిద్దో, బీ 32 ముథాల్ 44 వ‌రే ప‌లు అవార్డ్ విన్నింగ్ సినిమాలు ఇందులో ఉన్నాయి. త్వ‌ర‌లోనే మ‌మ్ముట్టి, మోహ‌న్‌లాల్ వంటి స్టార్ హీరోల సినిమాల‌ను ఇందులో స్ట్రీమింగ్ కోసం ఉంచ‌బోతున్న‌ట్లు తెలిసింది. సినిమాలు, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిలిమ్స్ స్ట్రీమింగ్ కోసం వేర్వేరు ప్లాన్స్‌ను ప్ర‌భుత్వం అనౌన్స్‌చేసింది.కొత్త ఫిలిం మేక‌ర్స్‌తో పాటు అవార్డు సినిమాల‌ను ప్రోత్స‌హించాల‌నే ప్ర‌భుత్వం ఈ ఓటీటీ యాప్‌ను లాంఛ్ చేసిన‌ట్లు తెలిసింది. ఆండ్రాయిడ్‌తో పాటు యాపిల్ యూజ‌ర్లు ఈ సీస్పేస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.

టాపిక్