Bhimaa OTT Release: గోపీచంద్ భీమా ఓటీటీలోకి వ‌చ్చేది ఆ రోజేనా ?- స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదంటే?-gopichand bhimaa to premiere on disney plus hotstar ott from april 5th bhimaa collections ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Gopichand Bhimaa To Premiere On Disney Plus Hotstar Ott From April 5th Bhimaa Collections

Bhimaa OTT Release: గోపీచంద్ భీమా ఓటీటీలోకి వ‌చ్చేది ఆ రోజేనా ?- స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదంటే?

Nelki Naresh Kumar HT Telugu
Mar 26, 2024 06:01 AM IST

Bhimaa OTT Release:గోపీచంద్ భీమా మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.

గోపీచంద్ భీమా మూవీ ఓటీటీ
గోపీచంద్ భీమా మూవీ ఓటీటీ

Bhimaa OTT Release: భీమా మూవీతో గోపీచంద్ ఖాతాలో మ‌రో ఫ్లాప్ చేరింది. మార్చి 8న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. ఔట్‌డేటెడ్ స్టోరీతో తెర‌కెక్కిన సినిమా ఇదంటూ ఆడియెన్స్ నుంచి దారుణంగా నెగెటివ్‌ కామెంట్స్ వ‌చ్చాయి. థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్‌గా నిలిచిన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది.

డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌...

భీమా మూవీ డిజిట‌ల్ రైట్స్‌ను డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ సొంతం చేసుకున్న‌ది. ఏప్రిల్ 5న ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న‌ట్లు స‌మాచారం. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతున్న‌ట్లు చెబుతోన్నారు. ఏప్రిల్ ఫ‌స్ట్ వీక్‌లో ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు తెలిసింది.

పోలీస్ ఆఫీస‌ర్‌గా...

భీమా సినిమాలో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో గోపీచంద్ న‌టించాడు. టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు ఏ హ‌ర్ష భీమా సినిమాను తెర‌కెక్కించాడు. క‌న్న‌డ ద‌ర్శ‌కుడైన హ‌ర్ష భీమా మూవీతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో ప్రియా భ‌వానీ శంక‌ర్‌, మాళ‌వికా శ‌ర్మ హీరోయిన్లుగా న‌టించారు.

భీమా క‌థ ఇదే....

మ‌హేంద్ర‌గిరిలో భ‌వానీ (ముఖేష్ రిషి) ముఠా ఎన్నో అక్ర‌మాల‌కు పాల్ప‌డుతుంటుంది. ఆ ప్రాంతానికి భీమా (గోపీచంద్‌) పోలీస్ ఆఫీస‌ర్‌గా వ‌స్తాడు. భ‌వానీ ముఠా సాగిస్తోన్న అన్యాయాల‌ను భీమా ఎలా అడ్డుకున్నాడు. భ‌వానీ గ్యాంగ్ మూసిన వేసిన ప‌ర‌శురామ క్షేత్రాన్ని తెరిపించే క్ర‌మంలో భీమాకు ఎలాంటి క‌ష్టాలు ఎదుర‌య్యాయి? అన్న‌దే ఈ మూవీ క‌థ‌. ఈ సినిమాలో గోపీచంద్ డ్యూయ‌ల్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో న‌టించాడు. ఈ మూవీకి కేజీఎఫ్ ఫేమ్ ర‌వి బ‌స్రూర్ మ్యూజిక్ అందించాడు.

12 కోట్ల బిజినెస్‌...

గోపీచంద్ గ‌త సినిమాలు ఫ్లాప్ అయినా టీజ‌ర్స్‌, ట్రైల‌ర్స్ ఆక‌ట్టుకోవ‌డంతో భీమా ప్రీ రిలీజ్ బిజినెస్ 12 కోట్ల వ‌ర‌కు జ‌రిగింది. ఆ క్రేజ్ కార‌ణంగా తొలిరోజు మూడు కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ మూవీ ఆ త‌ర్వాత డీలా ప‌డింది. ఓవ‌రాల్‌గా థియేట్రిక‌ల్ ర‌న్‌లో ఏడు కోట్ల లోపు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి నిర్మాత‌ల‌కు న‌ష్టాల‌ను మిగిల్చింది. మిక్స్‌డ్ టాక్‌తో సంబంధం లేకుండా ఫ‌స్ట్ వీక్‌లో బీసీ సెంట‌ర్స్‌లో భీమా మూవీ భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

జిల్ కాంబోలో మ‌రో మూవీ...

భీమా త‌ర్వాత ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల‌తో గోపీచంద్ ఓ మూవీ చేస్తోన్నాడు. శ్రీనువైట్ల గ‌త సినిమాల త‌ర‌హాలో యాక్ష‌న్ కామెడీ అంశాల‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాకు విశ్వం అనే పేరును ఖ‌రారు చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

విశ్వం మూవీలో కావ్య థాప‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.విశ్వం మూవీ కూడా ఈ ఏడాది రిలీజ్ కాబోతోంది. అలాగే జిల్ త‌ర్వాత గోపీచంద్‌, డైరెక్ట‌ర్ రాధాకృష్ణ కాంబోలో మ‌రో మూవీ రానున్న‌ట్లు స‌మాచారం. యూవీ క్రియేష‌న్స్ సంస్థ నిర్మించ‌బోతున్న‌ట్లు ఈ మూవీ ఆఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ త్వ‌ర‌లోనే రానున్న‌ట్లు స‌మాచారం.

WhatsApp channel