Vikramarkudu 2: విక్ర‌మార్కుడు 2పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ - సీక్వెల్‌కు డైరెక్ట‌ర్ రాజ‌మౌళి కాద‌ట-raviteja vikramarkudu 2 update not rajamouli sampath nandi directing this blockbuster sequel ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Raviteja Vikramarkudu 2 Update Not Rajamouli Sampath Nandi Directing This Blockbuster Sequel

Vikramarkudu 2: విక్ర‌మార్కుడు 2పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ - సీక్వెల్‌కు డైరెక్ట‌ర్ రాజ‌మౌళి కాద‌ట

Nelki Naresh Kumar HT Telugu
Mar 07, 2024 08:23 AM IST

Vikramarkudu 2: ర‌వితేజ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌లో ఒక‌టైన విక్ర‌మార్కుడు మూవీకి సీక్వెల్ రాబోతోంది. ఈ సీక్వెల్‌కు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి కాద‌ట‌. అత‌డి స్థానంలో ఈ సీక్వెల్‌ను డైరెక్ట్ చేయ‌బోయేది ఎవ‌రంటే?

ర‌వితేజ‌, రాజ‌మౌళి
ర‌వితేజ‌, రాజ‌మౌళి

Vikramarkudu 2: ర‌వితేజ మార్కెట్‌ను, రేంజ్‌ను పెంచిన సినిమాల్లో విక్ర‌మార్కుడు ఒక‌టి. ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో 2006లో రిలీజైన ఈ మూవీ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.ఇందులో అత్తిలిస‌త్తిబాబు అనే దొంగ‌గా, విక్ర‌మ్ రాథోడ్ అనే పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ల్లో ప‌వ‌ర్‌ఫుల్ యాక్టింగ్‌, కామెడీ టైమింగ్‌తో ర‌వితేజ అద‌ర‌గొట్టాడు. భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను ర‌వితేజ‌తో తెర‌కెక్కించ‌వ‌చ్చ‌నే న‌మ్మ‌కాన్ని విక్ర‌మార్కుడితోనే నిర్మాత్ల‌లో బ‌ల‌ప‌డేలా చేశారు డైరెక్ట‌ర్ రాజ‌మౌళి. ఈ సినిమాతోనే స్టార్ హీరోల లీగ్‌లో ర‌వితేజ ప్లేస్ ప‌క్కా అయిపోయింది.

11 కోట్ల బ‌డ్జెట్‌...23 కోట్ల క‌లెక్ష‌న్స్‌...

దాదాపు 11 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన విక్ర‌మార్కుడు మూవీ అప్ప‌ట్లోనే 23 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి రికార్డులు క్రియేట్ చేసింది. 2006లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన తెలుగు సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. విక్ర‌మార్కుడు సినిమాకు సీక్వెల్ రాబోతున్న‌ట్లు చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో విక్ర‌మార్కుడు 2 సినిమా చేయాల‌న్న‌ది కోరిక అంటూ గ‌తంలో ఓ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో ర‌వితేజ కూడా అన్నారు.

భీమా ప్రొడ్యూస‌ర్‌...

తాజాగా విక్ర‌మార్కుడు సీక్వెల్‌పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. విక్ర‌మార్కుడు సీక్వెల్‌కు సంబంధించి క‌థ మొత్తం సిద్ధ‌మైన‌ట్లు భీమా ప్రొడ్యూస‌ర్ కేకేరాధామోహ‌న్ అన్నాడు. విక్ర‌మార్కుడు సినిమాకు క‌థ‌ను అందించిన విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఈ సీక్వెల్ స్టోరీని రెడీ చేసిన‌ట్లు రాధామోహ‌న్ తెలిపాడు.

విక్ర‌మార్కుడు 2 టైటిల్‌ను మూడేళ్ల క్రిత‌మే త‌మ బ్యాన‌ర్‌పై రిజిస్ట‌ర్ చేయించిన‌ట్లు చెప్పాడు. విక్ర‌మార్కుడు 2 మూవీకి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి కాద‌ట‌. సంప‌త్‌నందితో ఈ సీక్వెల్ చేయాల‌ని ప్లాన్ చేశామ‌ని రాధామోహ‌న్ చెప్పాయి. విక్ర‌మార్కుడు సీక్వెల్‌లో న‌టించ‌డానికి ర‌వితేజ పెద్ద‌గా ఇంట్రెస్ట్ చూపించ‌డం లేదు. ఆయ‌న్ని ఒప్పించే ప్ర‌య‌త్నంలో ఉన్నాం. ర‌వితేజ ఒప్పుకుంటేనే సీక్వెల్ మొద‌లుపెడ‌తాం. స‌రైన కాంబినేష‌న్ సెట్‌కాక‌పోతే ఈ సీక్వెల్ చేయ‌ను.

విక్ర‌మార్కుడు సీక్వెల్ రావాల‌ని విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ కూడా కోరుకుంటున్నారు అని కేకేరాధామోహ‌న్ అన్నాడు. ర‌వితేజ‌, సంప‌త్ నంది త‌మ త‌మ సినిమాల‌తో బిజీగా ఉండ‌టంతో సీక్వెల్ ఆల‌స్య‌మ‌వుతోంద‌ని రాధామోహ‌న్ చెప్పాడు. విక్ర‌మార్కుడు సీక్వెల్‌పై భీమా ప్రొడ్యూస‌ర్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

అనుష్క హీరోయిన్‌...

విక్ర‌మార్కుడు సినిమాలో అనుష్క హీరోయిన్‌గా న‌టించింది. కీర‌వాణి మ్యూజిక్ అందించాడు. తెలుగులో విజ‌య‌వంత‌మైన ఈ సినిమా క‌న్న‌డ‌, త‌మిళం, హిందీతో పాటు ప‌లు భాష‌ల్లోకి రీమేక్ అయ్యింది.

ఇటీవ‌లే ఈగ‌ల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ర‌వితేజ‌. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా నిలిచింది. ఈగ‌ల్ మూవీకి కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప్ర‌స్తుతం హ‌రీష్ శంక‌ర్‌తో మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ సినిమా చేస్తున్నాడు ర‌వితేజ‌. అజ‌య్ దేవ్‌గ‌ణ్ బాలీవుడ్ మూవీ రైడ్ ఆధారంగా మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీ తెర‌కెక్కుతోంది. రాధామోహ‌న్ నిర్మించిన భీమా మూవీ మార్చి 8న రిలీజ్ అవుతోంది. గోపీచంద్ హీరోగా న‌టించిన ఈ సినిమాకు హ‌ర్ష ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో ప్రియా భ‌వానీ శంక‌ర్‌, మాళ‌వికా శ‌ర్మ హీరోయిన్లుగా న‌టించారు.

WhatsApp channel