AP TS Temperatures : తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడి ప్రతాపం, రానున్న 5 రోజులు బీఅలర్ట్
AP TS Temperatures : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రానున్న 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాయలసీమలో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
AP TS Temperatures : తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం(Summer Heat) మొదలైంది. భానుడి భగభగలతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. రానున్న 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు(AP TS Temperatures) భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ(IMD) హెచ్చరికలు జారీ చేసింది. ఎండల తీవ్రత పెరుగుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉదయం 10 గంటల నుంచే ఎంత తీవ్రత అధికంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ లో(Hyderabad Temperatures) ఎండల మండుతున్నాయి. రోజువారీ ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 5 డిగ్రీల వరకు పెరిగాయని వాతావరణ శాఖ తెలిపింది.
మార్చి 28 నుంచి మాడు పగిలే ఎండలు
దక్షిణాది నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న గాలుల ప్రభావంతో హైదరాబాద్ లో ఉక్కపోత పెరుగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో(TS Temperatures) ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఒక డిగ్రీ అధికంగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మార్చి 28 నుంచి మూడ్రోజులు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఏప్రిల్ రెండో వారం నుంచి ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించింది.
జాగ్రత్తలు తప్పనిసరి
రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు(Summer Healtcare) తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో బయటకు రావొద్దని సూచించారు. ముఖ్యమైన పనులుంటే ఉదయం, సాయంత్రం వేళల్లో చూసుకోవాలని చెబుతున్నారు. మధ్యాహ్నం వేళలో బయటకు వస్తే మంచి నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తాగాలని సూచించారు. డీహైడ్రేషన్ సమస్య తలెత్తకుండా తరుచూ మంచి నీరు తాగాలని కోరారు.
దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత రాయలసీమలో
ఏపీలోనూ ఎండలు(AP Weather Report) దంచికొడుతున్నాయి. మార్చిలోనే మాడు పగిలేలా ఎండలు కాస్తున్నాయి. అనంతపురంలో దేశంలోనే అత్యధికంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. ఈ నెల 27 వరకు రాయలసీమ(Rayalaseema High Temperatures) జిల్లాల్లో ఎండ వేడి, ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. విజయవాడలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు వరకూ రికార్డు అవుతున్నాయి. రానున్న 5 రోజులు రాయలసీమతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ పేర్కొంది. ఏప్రిల్ చివరి వారం, మే నెల ప్రారంభంలో రాయలసీమలో ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు చేరే అవకాశం ఉందన్నారు.
సంబంధిత కథనం