TS AP Weather : తెలంగాణ, ఏపీలో మండుతున్న ఎండలు- వచ్చే 5 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు-hyderabad telangana ap weather report next 5 days temperature rises ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Ap Weather : తెలంగాణ, ఏపీలో మండుతున్న ఎండలు- వచ్చే 5 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు

TS AP Weather : తెలంగాణ, ఏపీలో మండుతున్న ఎండలు- వచ్చే 5 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు

Bandaru Satyaprasad HT Telugu
Mar 23, 2024 08:15 PM IST

TS AP Weather : తెలంగాణ, ఏపీలో రానున్న 5 రోజులు వాతావరణ పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 5 రోజులు గరిష్ణ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల సెల్సియస్ పెరుగుతాయని ప్రకటించింది.

 తెలంగాణ, ఏపీలో మండుతున్న ఎండలు
తెలంగాణ, ఏపీలో మండుతున్న ఎండలు

TS AP Weather : గత వారం రోజులుగా కాస్త కూల్ అయిన సూర్యుడు(Summer Heat)...నేటి నుంచి మళ్లీ విజృంభిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పగటి పూట ఉష్ణోగ్రతలు(Temperatures Rises) పెరుగుతున్నాయి. మార్చి మొదటి నుంచి ఉష్టోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గత ఏడాది తరహాలో ఈసారి కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ కేంద్రాలు(IMD) హెచ్చరిస్తు్న్నాయి. తెలంగాణలో నేటి నుంచి రానున్న ఐదు రోజులు పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో రానున్న 5 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరుగుతాయని పేర్కొంది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

వచ్చే 5 రోజులు ఎండలు

తెలంగాణలో(Telangana Weather) మార్చి నెల ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో సగటున ఉష్ణోగ్రత 39 డిగ్రీలకు పైనే నమోదు అవుతున్నాయి. నేటి రానున్న 5 రోజులు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Department) హెచ్చరికలు జారీచేసింది. దక్షిణ దిశ నుంచి తెలంగాణ వైపు దిగువ స్థాయిగా గాలులు వీస్తున్నట్లు పేర్కొంది. ఉదయం 10 గంటల నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మధ్యాహ్న సమయాల్లో ప్రజలు అవసరం ఉంటే తప్పా బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తు్న్నారు. వచ్చే 5 రోజుల పాటు తెలంగాణలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు(Telangana Temperatures) నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. రాత్రి పూట సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వెల్లడించింది. ఎండలో బయటకు వెళ్తే నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఏపీలో పొడి వాతావరణం

ఏపీలో(AP Weather) మరో ఐదు రోజులు పోటీ వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు క్రమంగా ఉంటాయని పేర్కొంది. ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో గత వారం రోజులుగా ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిశాయి. దీంతో చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రత తగ్గింది. ఉత్తర కోస్తాలో గత వారం రోజులుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అయితే నేటి నుంచి రానున్న 5 రోజు వెదర్ రిపోర్టును వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర, దక్షిణ కోస్తాలో వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని తెలిపింది. ఎలాంటి వర్ష సూచన లేదని పేర్కొంది. వచ్చే ఐదు రోజులు రాయలసీమ(Rayalaseema Weather) జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పింది. ఒకటి రెండు చోట్ల అసౌకర్యమైన వాతావరణం ఉంటుందని తెలిపింది.

Whats_app_banner

సంబంధిత కథనం