AP TS Weather Updates : వర్ష సూచన లేదు...! ఏపీ, తెలంగాణలో మళ్లీ ఎండలు షురూ - తాజా అప్డేట్స్ ఇవే-no rain alerts to telugu states latest imd weather updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Ts Weather Updates : వర్ష సూచన లేదు...! ఏపీ, తెలంగాణలో మళ్లీ ఎండలు షురూ - తాజా అప్డేట్స్ ఇవే

AP TS Weather Updates : వర్ష సూచన లేదు...! ఏపీ, తెలంగాణలో మళ్లీ ఎండలు షురూ - తాజా అప్డేట్స్ ఇవే

Mar 22, 2024, 05:38 PM IST Maheshwaram Mahendra Chary
Mar 22, 2024, 05:38 PM , IST

  • AP Telangana Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎండలు షురూ అయ్యాయి. గత వారం రోజులుగా తేలికపాటి వర్షాలతో కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టగా… ఇవాళ్టి నుంచి మళ్లీ భానుడి భగభగలు పెరిగాయి. వాతావరణశాఖ తాజా బులెటిన్ వివరాలను ఇక్కడ చూడండి……
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో…. గత వారం రోజులుగా ఏపీ తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిశాయి. దీంతో చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రత తగ్గింది.

(1 / 5)

(unsplash.com/)

 ఏపీలోని ఉత్తర కోస్తాలో పది రోజులకుపైగా తేలికపాటి వర్షాలు కురిశాయి. కామీ మిగతా అన్ని ప్రాంతాల్లో ఎండలు దంచి కొట్టాయి. 

(2 / 5)

ఇక ఇవాళ్టి (మార్చి 22) వాతావరణశాఖ బులెటిన్ చూస్తే….ఉత్తర, దక్షిణ కోస్తాలో వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని తెలిపింది. ఎలాంటి వర్ష సూచన లేదని పేర్కొంది.

(3 / 5)

వచ్చే మూడు రోజులు రాయలసీమ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఒకటి రెండు చోట్ల అసౌకర్యమైన వాతావరణం ఉంటుందని అంచనా వేసింది.

(4 / 5)

(unsplash.com/s)

ఇక తెలంగాణలో చూస్తే వచ్చే వారం రోజులు వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని వెల్లడించింది. ఇవాళ(మార్చి 22) నల్గొండలో అత్యధికంగా  37. 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు