TS AP Temperatuers : ఈసారి ఎండలు ఎక్కువే..! 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు-temperatuer updates of telangana and andhrapradesh ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ts Ap Temperatuers : ఈసారి ఎండలు ఎక్కువే..! 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు

TS AP Temperatuers : ఈసారి ఎండలు ఎక్కువే..! 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు

Mar 02, 2024, 11:22 AM IST Maheshwaram Mahendra Chary
Mar 02, 2024, 11:22 AM , IST

  • Telangana AP Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు పెరిగిపోతున్నాయి. 40 డిగ్రీల చేరువకు ఉష్ణోగ్రతలు చేరుతున్నాయి. మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది  అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ అంచనా వేసింది.
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీ, తెలంగాణలో ఎండలు బాగా పెరిగిపోయాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రత తీవ్రతలు ఎక్కువవుతున్నాయి.

(1 / 6)

ఏపీ, తెలంగాణలో ఎండలు బాగా పెరిగిపోయాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రత తీవ్రతలు ఎక్కువవుతున్నాయి.(unsplash.com/)

ఫిబ్రవరి మాసం నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం మార్చిలోకి ఎంట్రీ ఇవ్వగా… రోజురోజుకూ ఎండలు ముదురుతున్నాయి. 

(2 / 6)

ఫిబ్రవరి మాసం నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం మార్చిలోకి ఎంట్రీ ఇవ్వగా… రోజురోజుకూ ఎండలు ముదురుతున్నాయి. (unsplash.com/)

శుక్రవారం(మార్చి 1) తెలంగాణలోని  పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరింది. ఆదిలాబాద్ లో 38.3 డిగ్రీలుగా నమోదైంది.

(3 / 6)

శుక్రవారం(మార్చి 1) తెలంగాణలోని  పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరింది. ఆదిలాబాద్ లో 38.3 డిగ్రీలుగా నమోదైంది.(unsplash.com/)

శుక్రవారం చూస్తే…. భద్రాచలం, నిజామాబాద్, మహబూబ్ నగర్, రామగుండం పట్టణ కేంద్రాల్లో 35 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

(4 / 6)

శుక్రవారం చూస్తే…. భద్రాచలం, నిజామాబాద్, మహబూబ్ నగర్, రామగుండం పట్టణ కేంద్రాల్లో 35 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. (unsplash.com/)

ఇవాళ, రేపు ఏపీలో పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.

(5 / 6)

ఇవాళ, రేపు ఏపీలో పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.(unsplash.com/)

ఎల్‌నినో  ఎఫెక్ట్ తో ఈ ఏడాది వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని IMD అంచనా వేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర కర్ణాటకతో పాటు మహారాష్ట్ర, ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వేడిగాలులు వీస్తాయని పేర్కొంది.

(6 / 6)

ఎల్‌నినో  ఎఫెక్ట్ తో ఈ ఏడాది వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని IMD అంచనా వేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర కర్ణాటకతో పాటు మహారాష్ట్ర, ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వేడిగాలులు వీస్తాయని పేర్కొంది.(IMD Met Hyd Twitter)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు