సమ్మర్ సీజన్‌లో హైడ్రేటెడ్‌గా ఉండటం ముఖ్యం. వేడిని తట్టుకోవడానికి, మన ఆరోగ్యాన్ని ఉత్తమంగా ఉంచడానికి లిక్విడ్స్, ఇతర హైడ్రేటింగ్ పానీయాలు, ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. 

pexels

By Bandaru Satyaprasad
Mar 17, 2024

Hindustan Times
Telugu

వేసవిలో మీ ఆహారం ఎంపిక పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్నాక్స్‌, భోజనాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. అధిక ప్రోటీన్, కెఫిన్, ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు, డార్క్ చాక్లెట్‌లు డీహైడ్రేషన్‌ను ప్రోత్సహిస్తాయి. వీటికి దూరంగా ఉండడమే బెటర్.  

pexels

మన శరీరం 60-70% నీటితో నిర్మితమైంది. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం వంటి ముఖ్యమైన అవయవాలు సజావుగా పనిచేయడానికి తగిన మోతాదులో ద్రవాలు అవసరం. అందుకే వేసవి కాలంలో మీ ఆహారంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. 

pexels

కాఫీ- కాఫీతో సహా కెఫిన్ ఉన్న పానీయాలు...తరచుగా మూత్రవిసర్జన చేసేలా చేస్తాయి. కెఫిన్ మూత్రపిండాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. తరచుగా మూత్రవిసర్జన, నీటిని బయటకు పంపేలా ప్రోత్సహిస్తుంది. నిర్జలీకరణానికి కారణమయ్యి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.  

pexels

మద్యం- ఆల్కహాల్, దాని ఉత్పన్నాలు శరీరంలో నీటి నష్టాన్ని కలిగించే డీహైడ్రేటింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఆల్కహాల్ తాగిన తర్వాత, మీ శరీరం డీహైడ్రేషన్‌కు సంకేతమైన పసుపు మూత్రం వస్తుంది.   

pexels

హై ప్రోటీన్ ఆహారం- ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం డీహైడ్రేషన్‌కు కారణం కావొచ్చు. ప్రొటీన్‌లోని నైట్రోజన్‌ జీవక్రియ చేయడానికి శరీరం ఎక్కువ నీటిని ఉపయోగిస్తుంది. దీంతో కణాలు నీటి శాతాన్ని గణనీయంగా కోల్పోతాయి. మీరు నిర్జలీకరణానికి గురవుతారు. 

pexels

 టీ- టీలోని కెఫిన్ కంటెంట్ కారణంగా డీహైడ్రేషన్ కలుగుతుంది. వేర్వేరు టీలు వివిధ రకాల కెఫిన్‌లను కలిగి ఉంటాయి.  

pexels

డార్క్ చాక్లెట్ - మిల్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్ రెండింటి కంటే డార్క్ చాక్లెట్‌లో కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. డార్క్ చాక్లెట్ ఎక్కువగా తింటే హృదయ స్పందన రేటు పెరగడం, విరేచనాలు, ఆందోళన, చిరాకు, భయం, డీహైడ్రేషన్ కు దారితీస్తుంది. 

pexels

ఊరగాయ పచ్చళ్లు- ఊరగాయలలో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరం డీహైడ్రేషన్ కు కారణం అవుతుంది. అందుకే సమ్మర్ లో తరచూ అజీర్ణ సమస్యలు వస్తుంటాయి.  

pexels

డ్రై ఫ్రూట్స్, మిల్క్ షేక్ లు, ఫాస్ట్ ఫుడ్స్, కారం అధికంగా ఉండే ఆహారాలు, డ్రింక్స్ లోని చక్కెర, సోడియం కంటెంట్ డీహైడ్రేషన్ కు కారణం అవుతాయి.

pexels

చర్మానికి మేలు చేసే కొలాజెన్‍ను పెంచగల 5 వెజిటేరియన్ ఆహారాలు

Photo: Pexels