Prime Video Top Trending in India: అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే-prime video top trending movies and web series in india ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prime Video Top Trending In India: అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే

Prime Video Top Trending in India: అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే

Hari Prasad S HT Telugu

Prime Video Top Trending in India: అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే. పిల్లలకు దసరా హాలిడేస్, మీకు వీకెండ్.. ఇంకేం అందరూ కలిసి వీటిని చూసే ప్రయత్నం చేయండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ 10 ట్రెండింగ్

Prime Video Top Trending in India: ఇండియాలోని ప్రముఖ ఓటీటీల్లో ఒకటి అమెజాన్ ప్రైమ్ వీడియో. ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఇప్పటికే ఎన్నో ఒరిజినల్ మూవీస్, సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇక ఎన్నో లేటెస్ట్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. మరి వీటిలో ఇండియాలో టాప్ 10 ట్రెండింగ్ లో ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్ ఏవో ఒకసారి చూద్దాం.

ప్రైమ్ వీడియో టాప్ 10 ట్రెండింగ్ ఇవే

1. ముంబై డైరీస్ సీజన్ 2 - ప్రైమ్ వీడియో ఇండియాలో టాప్ ట్రెండింగ్ లో తొలి స్థానంలో ఉన్నది వెబ్ సిరీస్ ముంబై డైరీస్ సీజన్ 2. 2008లో జరిగిన ముంబై దాడుల నేపథ్యంలో వచ్చిన ఈ సిరీస్ తొలి సీజన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ముంబైలో 2005లో వరదల సమయంలో జరిగిన విధ్వంసాన్ని కొత్త సీజన్ కళ్లకు కట్టింది. ఈ సిరీస్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుండటంతో టాప్ 1లో ఉంది.

2. తిరుచిత్రంబలం: ధనుష్, నిత్య మేనన్ నటించిన తిరుచిత్రంబలం మూవీ ఈ మధ్యే ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. గతేడాది రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమా ప్రైమ్ వీడియోలో రెండోస్థానంలో ఉంది.

3. రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ - బాలీవుడ్ లో రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ కలిసి నటించిన ఈ సినిమాను కరణ్ జోహార్ డైరెక్ట్ చేశాడు. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ మూవీ.. ప్రైమ్ వీడియోలోనూ దూసుకెళ్తూ మూడోస్థానంలో నిలిచింది.

4. కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ - నిత్య మేనన్ నటించిన వెబ్ సిరీస్ కుమారి శ్రీమతి. తన తాతకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఓ బార్ పెట్టడం ద్వారా డబ్బు సంపాదించి తన ఇంటిని తిరిగి సొంతం చేసుకునే అమ్మాయి కథే ఈ కుమారి శ్రీమతి. సరదాగా సాగిపోయే ఈ సిరీస్ నాలుగోస్థానంలో ఉంది.

5. జైలర్ మూవీ - ఈ ఏడాది సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన సూపర్ డూపర్ హిట్ మూవీ జైలర్. బాక్సాఫీస్ దగ్గర రూ.500 కోట్లకుపైగా వసూలు చేసిన జైలర్ మూవీ ఓటీటీలోనూ ప్రేక్షకుల ఆదరణ సంపాదిస్తోంది.

6. బంబాయ్ మేరీ జాన్ వెబ్ సిరీస్ - దావూద్ ఇబ్రహీం జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిని వెబ్ సిరీస్ బంబాయ్ మేరీ జాన్. ప్రైమ్ వీడియో ఒరిజినల్ అయిన ఈ సిరీస్ ఆరోస్థానంలో ఉంది.

ఏడోస్థానంలో తమిళ కామెడీ డ్రామా మూవీ లక్కీ మ్యాన్, ఎనిమిదో స్థానంలో హాస్టల్ డేజ్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్, తొమ్మిదో స్థానంలో జెన్ వీ ఇంగ్లిష్ వెబ్ సిరీస్, పదో స్థానంలో కన్నడ మూవీ సప్త సాగరదాచ్చె ఎల్లో మూవీ ఉన్నాయి.