Rajinikanth on Jailer Success: జైలర్ ఓ సాదాసీదా సినిమాలాగే అనిపించింది: రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్-rajinikanth shocks audience calls jailer a above average movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajinikanth On Jailer Success: జైలర్ ఓ సాదాసీదా సినిమాలాగే అనిపించింది: రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్

Rajinikanth on Jailer Success: జైలర్ ఓ సాదాసీదా సినిమాలాగే అనిపించింది: రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu
Sep 19, 2023 09:24 AM IST

Rajinikanth on Jailer Success: జైలర్ ఓ సాదాసీదా సినిమాలాగే అనిపించింది అంటూ రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మూవీ సక్సెస్ మీట్ లోనే అతడు ఈ కామెంట్స్ చేయడం గమనార్హం.

జైలర్ మూవీలో రజనీకాంత్
జైలర్ మూవీలో రజనీకాంత్ (MINT_PRINT)

Rajinikanth on Jailer Success: సూపర్ స్టార్ రజనీకాంత్ ను మరోసారి గాడిలో పెట్టిన సినిమా జైలర్. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.550 కోట్లకుపైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా సూపర్ హిట్ అని ప్రేక్షకులే తేల్చేశారు. కానీ రజనీకి మాత్రం ఈ మూవీ ఓ సాదాసీదా సినిమాలాగే అనిపించిందట.

ఈ విషయాన్ని రజనీకాంతే స్వయంగా చెప్పాడు. అది కూడా జైలర్ సక్సెస్ మీట్ లో కావడం అందరినీ షాక్ కు గురి చేసింది. "నిజం చెప్పాలంటే ఓ సాదాసీదా సినిమాలాగే జైలర్ అనిపించింది. అయితే అనిరుధ్ ఈ సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్లాడు. అతని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతం. దీనిని అతడు ఓ సవాలుగా తీసుకున్నాడు" అని రజనీ అనడం విశేషం.

తన సూపర్ హిట్ సినిమా గురించి రజనీకాంత్ ఇలా ఓపెన్ గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసినా.. అది కూడా నిజమే కదా అనుకుంటున్నారు. ఈ సినిమాలో అనిరుధ్ మ్యూజిక్ హైలైట్ అని మొదటి నుంచీ చెబుతూనే ఉన్నారు. కావాలా సాంగ్ తోపాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, రజనీ మేనరిజానికి అతికినట్లుగా సరిపోవడంతో జైలర్ సూపర్ హిట్ అయింది.

అదే విషయాన్ని సక్సెస్ మీట్ లో రజనీ చెప్పాడు. రీరికార్డింగ్ కంటే ముందు తాను జైలర్ సినిమా చూసినప్పుడు ఓ యావరేజ్ మూవీలాగే అనిపించిందని, అయితే రికార్డింగ్ తర్వాత ఓ రేంజ్ లో ఉందని అతడు అన్నాడు. అయితే మూవీ హిట్ కావడానికి క్రెడిట్ అంతా అనిరుధ్ కే ఇవ్వడంపై డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ మధ్యే అతని గత మూవీ బీస్ట్ గురించి కూడా రజనీ చేసిన కామెంట్స్ అభిమానులను కాస్త బాధపెట్టాయి. ఇక జైలర్ మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసిన విషయం తెలిసిందే. ఓటీటీలోనూ ఈ సినిమా దుమ్ము రేపుతోంది. ప్రైమ్ వీడియో ఇండియా టాప్ ట్రెండింగ్స్ లో జైలర్ రెండోస్థానంలో ఉంది.

టీ20 వరల్డ్ కప్ 2024