Anirudh Ravichander: జైలర్ సూపర్ హిట్.. అనిరుధ్‌కు లగ్జరీ పోర్షె కారు గిఫ్ట్-anirudh ravichander gets a costly porche from jailer produce kalanidhi maran ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Anirudh Ravichander Gets A Costly Porche From Jailer Produce Kalanidhi Maran

Anirudh Ravichander: జైలర్ సూపర్ హిట్.. అనిరుధ్‌కు లగ్జరీ పోర్షె కారు గిఫ్ట్

Hari Prasad S HT Telugu
Sep 04, 2023 09:48 PM IST

Anirudh Ravichander: జైలర్ సూపర్ హిట్ కావడంతో ప్రొడ్యూసర్ కళానిధి మారన్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌కు లగ్జరీ పోర్షె కారు గిఫ్ట్ గా ఇవ్వడం విశేషం.

కళానిధి మారన్ నుంచి పోర్షె కారు కీస్ అందుకుంటున్న అనిరుధ్
కళానిధి మారన్ నుంచి పోర్షె కారు కీస్ అందుకుంటున్న అనిరుధ్

Anirudh Ravichander: జైలర్ మూవీ ఎంతటి సంచలనం విజయం సాధించిందో మనకు తెలుసు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. తమిళ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఏకంగా రూ.600 కోట్లకుపైగా వసూలు చేసి ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

దీంతో ఈ మూవీ ప్రొడ్యూసర్, సన్ పిక్చర్స్ బాస్ కళానిధి మారన్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఈ మధ్యే జైలర్ లీడ్ రజనీకాంత్ కు రూ.100 కోట్ల చెక్కుతోపాటు ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ లకు కూడా రెండు లగ్జరీ పోర్షె కారులు ఇవ్వడం విశేషం. రజనీ ఇంటికి రెండు కార్లు తీసుకొని వెళ్లి ఏది కావాలో సెలక్ట్ చేసుకోమని అడిగినట్లే.. అనిరుధ్ ఇంటికి కూడా మూడు కార్లు తీసుకెళ్లాడు.

అందులో నుంచి అనిరుధ్ బ్లూ కలర్ పోర్షె కారును సెలక్ట్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఇక ఈ మూవీకి అతడు అందుకున్న రెమ్యునరేషన్ కు అదనంగా బోనస్ కూడా ఇచ్చాడు. జైలర్ మూవీ సక్సెస్ లో మ్యూజిక్ ది కూడా కీలకపాత్రే. కావాలా సాంగ్, రజనీకాంత్ ఫ్యాన్ ఆంథమ్ హుకుమ్ తోపాటు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదుర్స్ అనిపించేలా ఉంది.

జైలర్ మూవీ ప్రొడ్యూసర్ ఊహకందని విజయం సాధించడంతో ఆ సినిమాలో పని చేసిన వారి పంట పండుతోంది. ఈ సినిమా కోసం రజనీ రూ.110 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఇది కాకుండా మూవీకి భారీ కలెక్షన్లు రావడంతో లాభాల్లో వాటా రూపంలో మరో రూ.100 కోట్లు కూడా అతని సొంతమయ్యాయి. మొత్తంగా ఒక సినిమాకు రూ.210 కోట్లు అందుకొని ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా రజనీ నిలిచాడు.

ఇక జైలర్ మూవీ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. బాక్సాఫీస్ దగ్గర కాస్త జోరు తగ్గడంతో ఇక ఓటీటీ రిలీజ్ కు మేకర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.