Jawan Event: అనిరుధ్‍తో కలిసి స్టేజ్‍పై డ్యాన్స్‌ అదరగొట్టిన షారూఖ్ ఖాన్.. థ్రిల్ అయిన ఫ్యాన్స్: వీడియో-shah rukh khan joins anirudh ravichander to dance at jawan audio launch watch video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Shah Rukh Khan Joins Anirudh Ravichander To Dance At Jawan Audio Launch Watch Video

Jawan Event: అనిరుధ్‍తో కలిసి స్టేజ్‍పై డ్యాన్స్‌ అదరగొట్టిన షారూఖ్ ఖాన్.. థ్రిల్ అయిన ఫ్యాన్స్: వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 30, 2023 11:14 PM IST

Jawan Pre-Release event: జవాన్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‍గా జరిగింది. షారూఖ్ ఖాన్ డ్యాన్స్‌తో అదరగొట్టాడు. అనిరుధ్ రవిచందర్ తన లైవ్ పర్ఫార్మెన్స్‌తో మరోసారి మాయ చేశాడు.

Jawan Event: అనిరుధ్‍తో కలిసి స్టేజ్‍పై డ్యాన్స్‌ అదరగొట్టిన  షారూఖ్ ఖాన్.. థ్రిల్ అయిన ఫ్యాన్స్: వీడియో (Photo: Twitter)
Jawan Event: అనిరుధ్‍తో కలిసి స్టేజ్‍పై డ్యాన్స్‌ అదరగొట్టిన షారూఖ్ ఖాన్.. థ్రిల్ అయిన ఫ్యాన్స్: వీడియో (Photo: Twitter)

Jawan Pre-Release event: బాలీవుడ్ బాద్‍షా షారూఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న జవాన్ చిత్రంపై అంచనాలు అత్యంత భారీగా ఉన్నాయి. ఈ ఏడాది పఠాన్ లాంటి బ్లాక్‍బాస్టర్ తర్వాత షారూఖ్ చేసిన చిత్రం కావడంతో ఫుల్ హైప్ ఉంది. సెప్టెంబర్ 7వ తేదీన హిందీతో పాటు తమిళం, తెలుగులోనూ జవాన్ రిలీజ్ కానుంది. తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కోలీవుడ్ నటులు, టెక్నిషియన్స్ ఎక్కువగా ఉన్నారు. జవాన్ సినిమా ప్రీ-రిలీజ్/ఆడియా లాంచ్ ఈవెంట్ నేడు (ఆగస్టు 30) చెన్నైలోని శ్రీ సాయిరామ్ ఇంజినీరింగ్ కాలేజీలో గ్రాండ్‍గా జరిగింది.

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ జవాన్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో తన లైవ్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. ఫుల్ జోష్ నింపారు. ఎనర్జిటిక్‍గా స్పెప్పులు వేస్తూ పాటలు పాడారు. ఈ క్రమంలో అనిరుధ్.. షారూఖ్ ఖాన్‍ను చేయి పట్టుకొని స్టేజీపైకి తీసుకెళ్లారు. జిందా.. బందా పాటకు అనిరుధ్‍తో కలిసి స్టెప్‍లు వేశారు కింగ్ షారూఖ్. దీంతో ప్రేక్షకుల కేకలు, విజిళ్లతో ఈవెంట్ జరిగిన స్థలం దద్దరిల్లిపోయింది. షారూఖ్ డ్యాన్స్ చేయటంతో ఆడియన్స్ థ్రిల్ అయ్యారు.

అనిరుధ్‍తో కలిసి స్టేజీపై షారూఖ్ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. అలాగే, ఈ ఈవెంట్‍లో షారూఖ్ తన సిగ్నేచర్ స్టెప్స్ కూడా వేశారు. చెన్నై ఎక్స్‌ప్రెస్‍ పాటకు కూడా డ్యాన్స్ చేశారు. మొత్తంగా అభిమానులకు షారూఖ్ మంచి ట్రీట్ ఇచ్చారు.

అనిరుధ్ తనకు కొడుకులాంటి వాడని షారూఖ్ ఖాన్ ఈ ఈవెంట్‍లో చెప్పారు. అతడి మ్యూజిక్ అంటే తనకు ఎప్పటి నుంచో చాలా ఇష్టమని అన్నారు. జవాన్ మూవీ ముగియటంతో షారూఖ్‍తో ఎక్కువగా మాట్లాడడాన్ని తాను మిస్ అవుతానని అనిరుధ్ చెప్పారు. మొత్తంగా జవాన్ చిత్రంతో షారూఖ్, అనిరుధ్ మధ్య మంచి బంధం ఏర్పడినట్టు కనిపిస్తోంది.

జవాన్ చిత్రంలో హీరోయిన్‍గా నటించిన లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ ఈవెంట్‍కు రాలేదు. ఓనమ్ పండుగ ఉండటంతో ఆమె హాజరుకాలేదని దర్శకుడు అట్లీ చెప్పారు. ఈ మూవీలో విజయ్ సేతుపతి విలన్‍గా నటించగా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ప్రియమణి, సాన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగి బాబు తదితరులు ఈ చిత్రంలో కీరోల్స్ చేశారు.

జవాన్ థియేట్రికల్ ట్రైలర్ ఆగస్టు 31న దుబాయ్‍లోని బుర్జ్ ఖలీఫా వద్ద గ్రాండ్‍గా లాంచ్ కానుంది. సెప్టెంబర్ 7న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో జవాన్ రిలీజ్ కానుంది. ఐమ్యాక్స్ వెర్షన్‍లోనూ అందుబాటులోకి రానుంది.

IPL_Entry_Point