Rajinikanth Style Dosa : రజనీకాంత్ స్టైల్ దోసె తిన్నారా? ఎక్కడ దొరుకుతుందో తెలుసా?
Rajinikanth Style Dosa : దోసెల్లో చాలా రకాలు చూసి ఉంటారు... వాటి గురించి విని ఉంటారు. కానీ ఎప్పుడైనా రజనీకాంత్ స్టైల్ దోసె గురించి విన్నారా? ఇది ఎక్కడ దొరుకుతుంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లలో రికార్డు సృష్టించింది. ఎక్కడ చూసినా జైలర్ సినిమానే. ఆ సినిమాలోని కావాలయ్యా పాట చాలా ఫేమస్ అయింది. రజనీకాంత్ నటనతో పాటు అతని మ్యానరిజం స్టైల్ అందరికీ నచ్చుతుంది. అదొక బ్రాండ్ అని చెప్పొచ్చు. కళ్లద్దాలు పెట్టుకుని నడవడం.., నడిచే విధానం, ఆయన తీరు నచ్చని వారు ఉండరు.
రజనీకాంత్ సినిమా జైలర్ హిట్ అయిన తర్వాత రజనీకాంత్ ఫ్యాన్స్ హోటల్ ఒకటి తెరపైకి వచ్చింది. అది ముంబైలోని 'ముత్తు దోస కార్నర్'. ఈ హోటల్ తూర్పు దాదర్, ముంబైలో ఉంది. ఇదొక చిన్న హోటల్. సౌత్ ఇండియన్ దోస, ముత్తు అనే పేరు ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడ చేసే దోసెకు సూపర్ స్టార్ రజనీకాంత్ స్ఫూర్తి. సాదారణ దోసేలాగే ఉంటుంది. కాస్త రుచి వెరైటీగా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే.. దోసె చేసే విధానం, వడ్డించే విధానం చూస్తే రజనీకాంత్ స్టైల్ అని చెప్పొచ్చు.
ఈ దోసె కార్నర్‌లో వెన్న దోసె, సాదా దోసె, మైసూర్ మసాలా దోసె, పన్నీర్ దోసె తయారు చేస్తారు. జున్ను, వెన్న, నెయ్యి, ఉల్లిపాయలు, కారం, టొమాటో, బంగాళదుంప పల్యాలను కూడా దోసెకు ఉపయోగిస్తారు. ముత్తు దోసె కార్నర్‍లో దొరికే దోసె రుచి దాదర్ మొత్తంలో మరెక్కడా దొరకదు.
'నేను మైసూర్ చూడలేదు, మైసూర్ మసాలా దోసె ట్రై చేయడానికి తరచుగా ఇక్కడికి వస్తుంటాను. నాకు సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ఏదీ అర్థం కాదు, కానీ రజనీకాంత్ హిందీ డబ్బింగ్ సినిమాలు చూశాను. ఆయన స్టైల్ అంటే చాలా ఇష్టం. ఇక్కడి దోసె అంటే ఇష్టం. నేను ముత్తు అన్న దోసె స్టైల్ కి అభిమానిని.' అని చాలా మంది కొనియాడుతున్నారు. ఆయన దోసెలు చేసి వడ్డించడాన్ని చూసేందుకు రోజూ చాలా మంది ఇక్కడికి వస్తుంటారు.
'నేను దాదాపు 30 ఏళ్లుగా ఈ ఊళ్లో దోసె వ్యాపారం చేస్తున్నాను. రజనీకాంత్‌కి పెద్ద అభిమానిని. నా పేరు ముత్తు స్వామి. అయితే ఈ హోటల్‌కి నా పేరు పెట్టలేదు.. దీనికి రజనీకాంత్ సినిమా ‘ముత్తు’ పేరు పెట్టాను. జీవితంలో ఒక్కసారైనా కలిసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని' ముత్తు మందాసే తెలిపారు. మీరు ముంబైలో నివసిస్తుంటే, లేదా ముంబైని సందర్శిస్తున్నట్లయితే, దాదర్‌లోని ఈ ముత్తు దోసెను తినండి.