Jailer Closing Collections: జైలర్ మూవీ క్లోజింగ్ కలెక్షన్లు ఇవే.. ఎన్ని కోట్లంటే..
Jailer Closing Collections: జైలర్ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు పూర్తి కావొచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బ్లాక్‍బాస్టర్ అయింది. ఎన్ని కోట్లను రాబట్టిందంటే..
Jailer Closing Collections: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఆగస్టు 10న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా వసూళ్ల హోరు చూపింది. రజినీకి చాలా ఏళ్ల తర్వాత బంపర్ హిట్‍ను ఇచ్చింది. తలైవా ఈజ్ బ్యాక్ అంటూ తలైవా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేసింది. ఇప్పుడిప్పుడే జైలర్ మూవీ థియేట్రికల్ రన్ పూర్తవుతోంది. దీంతో ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్ల లెక్కలు వెల్లడవుతున్నాయి. జైలర్ చిత్రం ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే..
జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఈ విషయాన్ని ట్రేడ్ ఎనలిస్ట్ మనోబాల విజయబాలన్ వెల్లడించారు. ఈ చిత్రం ట్రిపుల్ లాభాలను తెచ్చిపెట్టిందని ట్వీట్ చేశారు. “జైలర్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్. క్లోజింగ్ కలెక్షన్ రూ.650 కోట్లు. ఈ సినిమాలో భాగమైన అందరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా మూడు రెట్ల లాభాలను తెచ్చిపెట్టింది. చరిత్రలో బిగ్గెస్ట్ కమ్‍బ్యాక్‍ను నెల్సన్ దిలీప్ కుమార్ అందించాడు” అని విజయబాలన్ ట్వీట్ చేశారు.
జైలర్ చిత్రంలో రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండియన్ పాత్రను చేశారు రజినీకాంత్. ఈ సినిమాలో ఆయన యాక్షన్, స్టైల్, స్వాగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీని తెరకెక్కించిన తీరు అదరగొట్టింది. ఇక అనిరుధ్ రవిచందర్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ జైలర్ చిత్రానికి చాలా బలమైంది. మొత్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బంపర్ కలెక్షన్లను సాధించింది.
జైలర్ సినిమాకు భారీ కలెక్షన్లు రావటంతో నిర్మాత కళానిధి మారన్.. ఇప్పటికే హీరో రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్, సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ కు లగ్జరీ కార్లు, చెక్కులు ఇచ్చారు. అలాగే, ఈ సినిమా కోసం పని చేసిన 300 మందికి గోల్డ్ కాయిన్స్ అందించారు. సక్సెస్ ఈవెంట్లు నిర్వహించారు.
జైలర్ మూవీకి సీనియర్ స్టార్లు మోహన్‍లాల్, శివరాజ్ కుమార్ చేసిన క్యామియో రోల్స్ కూడా బాగా ప్లస్ అయ్యాయి. వినాయకన్, వసంత్ రవి, రమ్యకృష్ణ, మిర్నా మీనన్ ఈ సినిమాలో కీలకపాత్రలు చేశారు.
జైలర్ సినిమా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి స్ట్రీమింగ్‍కు అందుబాటులో వచ్చింది.