Mrunal Thakur: పిల్లలను కనడానికి పెద్ద ప్లానే వేసిన సీతారామం బ్యూటీ.. మృణాల్ ఏం చెప్పిందో చూడండి
Mrunal Thakur: సీతారామం, ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మృణాల్ ఠాకూర్ రిలేషన్‌షిప్స్, పిల్లలను కనడంపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Mrunal Thakur: ఈకాలం రిలేషన్షిప్స్ పై నమ్మకం లేక పిల్లలను కనడానికి మృణాల్ ఠాకూర్ పెద్ద ప్లానే వేసింది. ఎగ్ ఫ్రీజింగ్ (అండాలను నిల్వచేయడం) ఆలోచన చేస్తున్నట్లు ఆమె చెప్పడం విశేషం. ఈ మధ్యే ఫ్యామిలీ స్టార్ మూవీలో కనిపించిన ఆమె.. వర్క్, లైఫ్ బ్యాలెన్స్ గురించి హ్యూమన్స్ ఆఫ్ బాంబేతో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
రిలేషన్షిప్స్ కష్టమే
సీతారామం, ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మృణాల్ ఠాకూర్ ఈ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తన కెరీర్, జీవితం రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయడమే తన ప్రాధాన్యత అని ఆమె చెప్పింది. "కెరీర్, లైఫ్ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ముఖ్యం. కానీ మనం ఎప్పుడూ దానిని ఎలా చేయాలన్నదాని గురించి ఆలోచిస్తూనే ఉంటాం. రిలేషిన్షిప్స్ అంటే కష్టమన్న విషయం నాకు తెలుసు. మనం చేసే పనిని అర్థం చేసుకునే భాగస్వామిని పొందడం చాలా అవసరం. ఎగ్ ఫ్రీజింగ్ గురించి కూడా ఆలోచిస్తున్నాను" అని మృణాల్ చెప్పింది.
ఈమధ్యే మరో బాలీవుడ్ నటి మోనా సింగ్ కూడా తన అండాలను ఇలాగే నిల్వ చేసినట్లు చెప్పిన నేపథ్యంలో మృణాల్ ఇలా స్పందించింది. ప్రస్తుతానికి కెరీర్ పై దృష్టి సారించడం, ఒక దశ దాటిన తర్వాత తమ నిల్వ చేసిన అండాలతో పిల్లలను కనడానికి ప్రయత్నించడం అనేది సాధారణమైపోతోంది. ముఖ్యంగా హీరోయిన్లు దీనిని సీరియస్ గా పరిగణిస్తున్నారు.
థెరపీ కూడా తీసుకుంటా
ఒక్కోసారి అసలు బెడ్ పై నుంచి లేవాలని అనిపించదని, అయినా తన బిజీ షెడ్యూల్ వల్ల షూటింగ్ లకు వెళ్తూనే ఉంటానని మృణాల్ చెప్పింది. ఇలాంటి రోజులను ఎదుర్కోవడానికి తాను థెరపీతోపాటు ఇష్టమైన వాళ్ల సాయం తీసుకుంటానని తెలిపింది. "నా పనిని నేను ఓ బ్యాండ్ ఎయిడ్ లా ఉపయోగించేదానిని.
కానీ ఒకసారి నా పని ముగించుకొని ఇంటికి వెళ్లిన తర్వాత నేను చాలా దారుణంగా ఉంటాను. అలా ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఇప్పుడు ఓపెన్ గా ఈ విషయం చెబుతున్నాను. నేను కూడా థెరపీలకు వెళ్తాను. ఇది అందరికీ ముఖ్యమైనది. భిన్నమైన పాత్రలను పోషించే నటులకు ఇది మరీ ముఖ్యం" అని మృణాల్ చెప్పింది.
ఈ మధ్యే విజయ్ దేవరకొండతో కలిసి ఆమె ఫ్యామిలీ స్టార్ మూవీలో కనిపించింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. నిర్మాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. అయితే మూడు వారాల్లోనే అంటే శుక్రవారం (ఏప్రిల్ 26) నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
గతేడాది చివర్లో నానితో కలిసి హాయ్ నాన్న మూవీ కూడా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హిందీలో పూజా మేరీ జాన్ మూవీ చేస్తోంది. ఆ తర్వాత సంజయ్ లీలా భన్సాలీ మూవీలోనూ నటించబోతోంది. గతేడాది లస్ట్ స్టోరీస్ 2 ఆంథాలజీలోనూ మృణాల్ నటించింది.