Panchayat S3 Release: ఈనెలలోనే స్ట్రీమింగ్‍కు రానున్న పంచాయత్ సీజన్ 3.. డేట్ కోసం ఫ్యాన్స్‌కు పని పెట్టిన ఓటీటీ
Panchayat Season 3 Release: పంచాయత్ వెబ్ సిరీస్ సీజన్ 3 గురించి ఓటీటీ ప్లాట్‍ఫామ్ మరో అప్‍డేట్ ఇచ్చింది. మే నెలలోనే స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు స్పష్టం చేసింది. ఆ వివరాలివే..
Panchayat Season 3 Release: పంచాయత్ వెబ్ సిరీస్ మూడో సీజన్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ రెండు సీజన్లు చాలా పాపులర్ అయ్యాయి. ప్రేక్షకులను మెప్పించి భారీ స్థాయిలో వ్యూస్ దక్కించుకున్నాయి. దీంతో మూడో సీజన్ ఎప్పుడొస్తుందా అని నిరీక్షణ ఉంది. అయితే, పంచాయత్ మూడో సీజన్‍పై అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ అదిరిపోయే అప్‍డేట్ ఇచ్చింది. ఈనెల (మే, 2024)లోనే ఈ సీజన్‍ను రిలీజ్ చేస్తున్నట్టు ఖరారు చేసింది. అలాగే, అభిమానులకు ఓ టాస్క్ కూడా ఇచ్చింది.
డేట్ కోసం టాస్క్
పంచాయత్ మూడో సీజన్‍ను మే నెలలోనే స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు అమెజాన్ ప్రైమ్ వీడియో నేడు (మే 1) నేడు వెల్లడించింది. అయితే, స్ట్రీమింగ్ డేట్‍ను మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. డేట్ కోసం అభిమానులకు ఓ టాస్క్ ఇచ్చింది.
పంచాయత్ సీజన్ 3 డేట్ రివీల్ కావాలంటే అభిమానులకు ఓ పని పెట్టింది ప్రైమ్ వీడియో. ఈ సీజన్ కోసం డేట్ కోసం ఏకంగా panchayat3date.com వెబ్‍సైట్‍ను తీసుకొచ్చింది. ఈ సైట్‍లోకి వెళ్లి అక్కడ ఉన్న సొరకాయలను తొలగించే టాస్క్ ఇచ్చింది. ఓ యూజర్ 15 నిమిషాలకు ఓ సొరకాయను రిమూవ్ చేసేలా సెట్ చేసింది. ఇవి పూర్తయితే స్ట్రీమింగ్ డేట్‍ను వెల్లడించనుంది. దీంతో అతిత్వరలోనే స్ట్రీమింగ్ డేట్ రివీల్ కానుంది.
స్ట్రీమింగ్ డేట్ ఇదేనా!
పంచాయత్ మూడో సీజన్ మే 28వ తేదీన స్ట్రీమింగ్‍కు వస్తుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని పింక్‍విల్లా రిపోర్ట్ వెల్లడించింది. ఐపీఎల్ ఫైనల్ మే 26న జరగనుంది. దీంతో ఐపీఎల్ ఫీవర్ ముగియనుండటంతో మే 28న ఈ మూడో సీజన్‍ను ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్‍కు తీసుకొస్తుందనే అంచనాలు ఉన్నాయి.
పంచాయత్ వెబ్ సిరీస్‍లో జితేంద్ర కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అభిషేక్ త్రిపాఠి అనే గ్రామపంచాయతీ సెక్రటరీ పాత్రలో ఆయన చేస్తున్నారు. రఘువీర్ యాదవ్, నీనా గుప్తా, ఫైజల్ మాలిక్, శాన్విక కీరోల్స్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‍కు దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్నారు.
పంచాయత్ వెబ్ సిరీస్ ఉత్తరప్రదేశ్‍లోని ఫులేరా అనే మూరుమూల గ్రామంలో సాగుతుంది. కామెడీ డ్రామాగా ఈ సిరీస్ వస్తోంది. అయితే, సామాజిక అంశాలు కూడా ఉంటాయి. దీపక్ కుమార్ మిశ్రా తెరకెక్కించిన ఈ సిరీస్‍ను ది వైరల్ ఫీవర్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ సిరీస్‍కు చందన్ కుమార్ కథను అందిస్తున్నారు.
పంచాయత్ వెబ్ సిరీస్ తొలి సీజన్ 2020 ఏప్రిల్ 3వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. 8 ఎపిసోడ్లు ఈ ఉన్న ఈ సీజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. చాలా పాపులర్ అయింది. 2022 మేలో వచ్చిన రెండో సీజన్ కూడా అదే రేంజ్‍లో సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు, 2024 మేలో మూడో సీజన్ రానుంది. దీనిపై కూడా హైప్ విపరీతంగా ఉంది.
ఈ సిరీస్ కోసం కూడా..
మీర్జాపూర్ మూడో సీజన్ కోసం కూడా ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్‍లోనూ తొలి రెండు సీజన్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. రికార్డుస్థాయిలో అత్యధిక వ్యూవర్ షిప్ దక్కించుకున్నాయి. దీంతో మూడో సీజన్ కోసం చాలా మంది వేచిచూస్తున్నాయి. ఈ మీర్జాపూర్ మూడో సీజన్‍ను జూన్ లేకపోతే జూలైలో తీసుకురావాలని ప్రైమ్ వీడియో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
టాపిక్