తెలుగు న్యూస్  /  Entertainment  /  Prabhas Adipurush Ott Release In This Ott Platform

Adipurush OTT Release : ఆదిపురుష్ వచ్చేది ఈ ఓటీటీలోనే..!

Anand Sai HT Telugu

05 June 2023, 9:43 IST

    • Adipurush OTT Streaming : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఏ ఓటీటీలో వస్తుందోనని కూడా చాలా మంది ఎదురుచూస్తున్నారు.
ప్ర‌భాస్ ఆదిపురుష్
ప్ర‌భాస్ ఆదిపురుష్

ప్ర‌భాస్ ఆదిపురుష్

ఆదిపురుష్ సినిమా(Adipurush Cinema) గురించి చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటించారు. ఓం రావత్(Om Raut) దర్శకత్వం వహించాడు. అనేక కారణాలతో ఆదిపురుష్ సినిమాపై భారీగా హైప్ క్రియేట్ అయింది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది . ఈ చిత్రం రామాయణం కథ ఆధారంగా రూపొందింది. ఇప్పటికే ట్రైలర్‌ చూసి అభిమానులు ఎంజాయ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Baahubali The Crown of Blood: మరో రూపంలో బాహుబలి వస్తోంది.. ప్రకటించిన దర్శక ధీరుడు రాజమౌళి: వివరాలివే

Siddharth Roy OTT: బోల్డ్ రొమాంటిక్ మూవీ సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి రానుందంటే..

Pushpa 2 First Song: పుష్ప 2 ఫస్ట్ సాంగ్ రిలీజ్ టైమింగ్‍లో మార్పు.. అల్లు అర్జున్ నయా లుక్ రివీల్

Tollywood: ఆ ఒక్కటి అడక్కు, ప్రసన్న వదనం సినిమాల రన్‍టైమ్ ఇదే.. క్రిస్ప్‌గా అల్లరి నరేశ్ మూవీ

ఈ సినిమా ప్రభాస్‌కి చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్. 'ఆదిపురుష్'తో హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. సినిమా తొలిరోజు బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేస్తుందోనని అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. బాక్సాఫీస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది.

మేకర్స్ ఈ చిత్రాన్ని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్, రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ 6 జూన్ 2023న తిరుపతి(Tirupati)లో జరగనుంది. ఈలోగా ఆదిపురుష్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్(Adipurush Digital Rights) ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'(Amazon Prime Video) ద్వారా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఫ్యాన్సీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు ఇన్‌సైడ్ టాక్. ఆదిపురుష్ సినిమా కోసం.. సుమారు 550 కోట్ల వరకూ ఖర్చు చేశారు. శాటిలైట్, డిజిటల్ రైట్స్ అన్ని భాషలూ కలిపి.. దాదాపు 250 కోట్లకు అమ్మేసినట్టు టాక్. మరోవైపు ఏపీ, తెలంగాణ థియేటరికల్ రైట్స్ 185 కోట్ల వ్యాపారం జరిగింది. ఓవర్సీస్, హిందీ, ఇతర భాషల్లో లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా నిర్మాతలే విడుదల చేస్తున్నారు. సరిగా వర్కౌట్ అయితే.. మెుదటి వారంతంలోనే నిర్మాతల డబ్బు వెనక్కు వచ్చేస్తుంది.

పాన్ ఇండియా(Pan India) లెవల్లో ఆదిపురుష్ సినిమా విడుదలవుతోంది. కన్నడ, తెలుగు, హిందీ, మలయాళం, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ మంచి ఓపెనింగ్‌ వస్తుందని అంచనా వేస్తున్నారు. హిందీ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.