Thalapathy Vijay Csk: సీఎస్‌కేగా రాబోతున్న దళపతి విజయ్ - 68వ సినిమాకు టైటిల్ ఫిక్స్
Thalapathy Vijay Csk: దళపతి విజయ్ నెక్స్ట్ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఐపీఎల్ ఫ్రాంచైజ్ టీమ్ పేరుతో విజయ్ ఈ సినిమా చేయనున్నట్లు తెలిసింది. ఆ పేరు ఏదంటే....
Thalapathy Vijay Csk: సీఎస్‌కే పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా చెన్నై క్రికెట్ ఫ్యాన్స్ సీఎస్‌కేను తమ సొంత జట్టులా భావిస్తోంటారు. ఈ టీమ్‌తో చెన్నై అభిమానులకు ఎమోషనల్ కనెక్టివిటీ ఏర్పడింది. స్టార్ హీరోల నుంచి సామాన్యుల వరకు అందరూ సీఎస్‌కే టీమ్‌కు అభిమానులే. సీఎస్‌కే ఫ్యాన్స్‌లో దళపతి విజయ్ కూడా ఒకరు. తాజాగా ఈ ఐపీఎల్ ఫ్రాంచైజ్ పేరునే దళపతి విజయ్ నెక్స్ట్ సినిమాకు టైటిల్‌గా ఫిక్స్ చేసినట్లు సమాచారం.
దళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రకటించారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి సీఎస్‌కే అనే పేరును పరిశీలిస్తోన్నట్లు తెలిసింది. సీఎస్‌కే అనే పేరుకు తమిళంలో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొనే ఈ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు చెబుతోన్నారు.
ఇందులో సీఎస్‌కే అనే క్యారెక్టర్‌లోనే విజయ్ కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ టైటిల్ కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. దళపతి విజయ్ హీరోగా నటిస్తోన్న 68వ సినిమా ఇది. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్ లొకేషన్ కనకరాజ్‌తో లియో సినిమా చేస్తోన్నాడు.
గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్టర్ తర్వాత విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ మూవీలో సంజయ్‌దత్ కీలక పాత్రను పోషిస్తోన్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన కస్టడీ మూవీ ఇటీవలే రిలీజైంది. నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో డిజాస్టర్‌గా మిగిలింది.