Custody Day 1 Collection: కస్టడీ ఫస్ట్ డే కలెక్షన్స్ - నాగచైతన్యకు మరో డిజాస్టర్ ఖాయమేనా!
Custody Day 1 Collection: నాగచైతన్య కెరీర్‌లో తొలిరోజు లోయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా కస్టడీ నిలిచింది. ఈ సినిమాకు తొలిరోజు వచ్చిన కలెక్షన్స్ ఎంతంటే....
Custody Day 1 Collection: కస్టడీ మూవీకి ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్ వచ్చాయి. నాగచైతన్య కెరీర్‌లో తొలి రోజు లోయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా కస్టడీ నిలిచింది. మొదటి రోజు ఈ సినిమా 7.4 కోట్ల గ్రాస్, 3.9 కోట్ల షేర్ దక్కించుకున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. శుక్రవారం నాడు నైజాంలో అత్యధికంగా కోటి వరకు ఈ సినిమాకు కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. సీడెడ్‌లో యాభై లక్షల వరకు వసూళ్ల రాబట్టినట్లు చెబుతోన్నారు. తమిళ్ వెర్షన్ దారుణంగా నిరాశపరిచింది.
తొలిరోజు తమిళంలో ఈ సినిమాకు 15 లక్షల లోపే కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. కస్టడీపై ఉన్న హైప్ కారణంగా మొదటిరోజు ఈ సినిమా ఐదు కోట్లకుపైగా షేర్‌ను రాబట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. మొదటి ఆట నుంచే నెగెటివ్ టాక్ రావడంతో అంచనా వేసిన వసూళ్లను సగం మాత్రమే రాబట్టి నిరాశను మిగిల్చింది. థాంక్యూ తర్వాత నాగచైతన్య కెరీర్‌లో లోయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా కస్టడీ నిలిచింది.
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. ముఖ్యమంత్రి అవినీతి, అక్రమాలకు సాక్షిగా నిలిచిన ఓ నేరస్తుడిని కోర్టులో అప్పగించే క్రమంలో ఓ నిజాయితీపరుడైన పోలీస్ కానిస్టేబుల్ సాగించిన ప్రయాణం నేపథ్యంలో దర్శకుడు వెంకట్ ప్రభు కస్టడీ సినిమాను తెరకెక్కించారు.
క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కానిస్టేబుల్ పాత్రలో నాగచైతన్య యాక్టింగ్‌కు ప్రశంసలు దక్కుతోన్నాయి. కానీ రొటీన్ కథ, కథనాల కారణంగా సినిమా యావరేజ్‌గా నిలిచింది. ఇందులో నాగచైతన్యకు జోడీగా కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. అరవింద్ స్వామి, శరత్‌కుమార్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు. కస్టడీ సినిమాతోనే నాగచైతన్య తమిళంలోకి ఎంట్రీ ఇచ్చాడు.