IPL 2023, CSK Vs DC : సీఎస్‌కే-దిల్లీ పోరు.. చెన్నై గెలిస్తే ఏమవుతుంది?-ipl 2023 chennai super kings head to head match with delhi capitals in chepauk stadium ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2023, Csk Vs Dc : సీఎస్‌కే-దిల్లీ పోరు.. చెన్నై గెలిస్తే ఏమవుతుంది?

IPL 2023, CSK Vs DC : సీఎస్‌కే-దిల్లీ పోరు.. చెన్నై గెలిస్తే ఏమవుతుంది?

Anand Sai HT Telugu
May 10, 2023 09:57 AM IST

IPL 2023, CSK Vs DC : ఐపీఎల్ లో మే 10న చెన్నై-దిల్లీ మధ్య మ్యాచ్ జరగనుంది. 11 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే 6 విజయాలు, 4 ఓటములతో 13 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. దిల్లీ 10 మ్యాచ్‌ల్లో 4 గెలిచి, 6 మ్యాచ్‌ల్లో ఓడి 8 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. బుధవారం జరిగే మ్యాచ్ లో చెన్నై గెలిస్తే ఏం అవుతుంది?

చెన్నై సూప‌ర్ కింగ్స్
చెన్నై సూప‌ర్ కింగ్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ రోజురోజుకు మరింత ఉత్కంఠగా సాగుతోంది. చివరి దశకు చేరుకుంటున్న ఐపీఎల్ 2023(IPL 2023)లో ఒక జట్టు గెలుపు-ఓటములు మరో జట్టు మీద ప్రభావం చూపిస్తున్నాయి. కాగా చెన్నై సూపర్ కింగ్స్ మే 10న చెపాక్ స్టేడియం(chepauk stadium)లో డేవిడ్ వార్నర్‌ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ (CSK vs DC)తో తలపడనుంది. 11 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే 6 విజయాలు, 4 ఓటములతో 13 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ 10 మ్యాచ్‌ల్లో 4 గెలిచి, 6 మ్యాచ్‌ల్లో ఓడి 8 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో చెన్నై గెలిస్తే దాదాపు ప్లే ఆఫ్ దశకు చేరినట్లే.

CSK జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉంది. రుతురోయ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. అజింక్య రహానే కూడా బాగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. శివమ్ దూబే ప్రతి మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అంబటి రాయుడు, మొయిన్ అలీ ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. ధోనీ, జడేజాలు ఫినిషింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆరంభంలో బలహీనంగా ఉన్న CSK బౌలింగ్ ఇప్పుడు బలంగా ఉంది. మతీషా పతిరనా వికెట్ టేకింగ్ బౌలర్‌గా కనిపించాడు. ఈ మ్యాచ్ లో చెన్నై గెలిస్తే.. ప్లేఆఫ్స్ కు చేరినట్టే.

గతంలో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించింది. తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాలంటే, మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సిన ఒత్తిడిలో ఉంది. ఆరంభంలో ఢిల్లీ జట్టు కెప్టెన్‌.. అటు ఇటుగా కనిపించినా.. ఆ తర్వాత పుంజుకుంటోంది. పృథ్వీ షా స్థానంలో వచ్చిన పిలిప్ సాల్ట్(Philip Salt) గత మ్యాచ్‌లో సూపర్ బ్యాటింగ్ చేశాడు. మిచెల్ మార్ష్, రిలే రస్సో సహకరిస్తున్నారు. అక్షర్ పటేల్ కూడా అప్పుడప్పుడు బాగానే ఆడుతున్నాడు. ఢిల్లీ బౌలింగ్‌లో ఇంకా ఇంప్రూవ్ కావాల్సి ఉంది. ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, ఎన్రిచ్ నార్ట్జే, కుల్దీప్ యాదవ్ మరింత సహకారం అందించాలి.

పాయింట్స్ టేబుల్ చూసుకుంటే.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 11 మ్యాచ్‌ల్లో 4 ఓటములు, 6 విజయాలు సాధించింది. మరో మ్యాచ్ రద్దు కారణంగా 1 పాయింట్ లభించింది. ప్రస్తుతం 2వ స్థానంలో ఉన్న CSK జట్టు నెట్ రన్ రేట్ +0.409గా ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ కు చేరువైనట్టే. డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 10 మ్యాచ్‌లలో 4 గెలిచింది. దీంతో ఢిల్లీ జట్టు నెట్ రన్ రేట్ -0.529తో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.

Whats_app_banner