CSK Tweets Viral: విరాట్ కోహ్లీ దాదాపు మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. అదిరపోయే శతకంతో అభిమానుల కోరికను తీర్చిన సంగతి తెలిసిందే. గురువారం ఆఫ్గానిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో కెరీర్‌లో 71వ అంతర్జాతీయ శతకాన్ని నమోదు చేసిన కోహ్లీ ఫామ్‌ను తిరిగి అందిపుచ్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడు 61 బంతుల్లో 122 పరుగులతో దుమ్మురేపాడు. దీంతో విరాట్‌పై ప్రశంసల వర్షం వెల్లువెత్తింది. సోషల్ మీడియా వేదికగా అభిమానులు కోహ్లీకి అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోహ్లీపై చేసిన వరుస ట్వీట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
"కింగ్ ఈజ్ బ్యాక్ అని అందరూ అంటున్నారు.. కానీ అతను ఎక్కడికైనా వెళ్తే కదా.. అతడు వెళ్లాడా? అతడు తన పోరాటాల్లో మొదట నుంచి పదే పదే పోరాడుతూనే ఉన్నాడు. సవాళ్లను నిర్భయంగా ఎదుర్కొన్నాడు. ఒక్కసారి కూడా వెనుదిరగలేదు. కనికరం లేదని యోధుడిని ఎవ్వరూ అడ్డుకోలేరు.. అడ్డంకులు ఆపలేవు. అతడు ఆడాల్సిన ఆట ఇంకా మిగిలే ఉంది." అంటూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుస ట్వీట్లతో విరాట్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు కూడా వీటిపై విశేషంగా స్పందిస్తున్నారు.
దుబాయ్ వేదికగా ఆఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. 1020 రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో శతకం నమోదు చేసిన కోహ్లీ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. 213 పరుగుల లక్ష్య ఛేదనంలో ఆఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 111 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా భారత్ 101 పరుగుల తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది.
అయితే ఇప్పటికే ఆసియా కప్ ఫైనల్ చేరడంలో టీమిండియా ప్రయాణం ముగిసింది. సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్, శ్రీలంక చేతిలో పరజాయం పాలై.. తన ప్రయాణాన్ని ముగిసింది. అయితే ఆసియా కప్‌లో తన చివరి మ్యాచ్‌ను ఆఫ్గానిస్థాన్‌తో ఆడి విజయంతో మ్యాచ్‌ను ముగించింది.
సంబంధిత కథనం