Eid 2022 | ఈద్‌ సెలబ్రేట్‌ చేసుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్ ప్లేయర్స్‌.. వీడియో-chennai super kings team celebrated eid in its way ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Eid 2022 | ఈద్‌ సెలబ్రేట్‌ చేసుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్ ప్లేయర్స్‌.. వీడియో

Eid 2022 | ఈద్‌ సెలబ్రేట్‌ చేసుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్ ప్లేయర్స్‌.. వీడియో

HT Telugu Desk HT Telugu
May 03, 2022 04:16 PM IST

రంజాన్‌ పండుగను మంగళవారం ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. వాళ్లతోపాటే ఐపీఎల్‌ మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ టీమ్స్‌లో ఒకటైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ కూడా జరుపుకుంది.

<p>ఈద్ పార్టీలో ధోనీ, ఉతప్ప</p>
<p>ఈద్ పార్టీలో ధోనీ, ఉతప్ప</p> (CSK Twitter)

ముంబై: ఐపీఎల్‌లో ఆటతోపాటు టీమ్‌ ప్రమోషన్లలోనూ ఎప్పుడూ ముందుండే టీమ్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌. విజిల్‌ పోడు అనే ట్యాగ్‌లైన్‌తో ఈ టీమ్‌ మొదటి నుంచీ అన్ని టీమ్స్‌తో పోలిస్తే కాస్త ప్రత్యేకంగానే ఉంటోంది. తాజాగా ఆ టీమ్‌ ఈ ఏడాది రంజాన్‌ను సెలబ్రేట్‌ చేసుకోవడం విశేషం. సీఎస్కే ప్లేయర్సంతా ఈద్‌ సందర్భంగా హోటల్‌లో స్పెషల్‌ ఫుడ్‌ను ఎంజాయ్‌ చేశారు.

దీనికి సంబంధించిన వీడియోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌ అధికారిక ట్విటర్‌ హ్యాండిల్‌ షేర్‌ చేసింది. కెప్టెన్‌ ధోనీతోపాటు రుతురాజ్‌ గైక్వాడ్‌, మొయిన్‌ అలీ, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, డ్వేన్‌ బ్రేవో లాంటి ప్లేయర్స్‌ ఈ ఈద్‌ సెలబ్రేషన్స్‌లో పార్టిసిపేట్‌ చేయడం వీడియోలో చూడొచ్చు. ధోనీ, ఉతప్పలాంటి వాళ్లు పిల్లలతో సరదాగా గడిపారు.

పండుగలను సూపర్‌ కింగ్స్‌ తరహాలో జరుపుకుంటామంటూ ఈ వీడియోను సీఎస్కే టీమ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. జడేజా కెప్టెన్సీ నుంచి దిగిపోయి.. తిరిగి ధోనీ కెప్టెన్‌ అయిన తర్వాత సన్‌రైజర్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లోనే చెన్నై గెలిచిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో ఆడిన 9 మ్యాచ్‌లలో మూడు విజయాలతో చెన్నై ఖాతాలో ఆరు పాయింట్లు ఉన్నాయి.

సంబంధిత కథనం

టాపిక్