CSK vs LSG: చెపాక్‌లో చెన్నై జోరు - ల‌క్నోపై థ్రిల్లింగ్ విక్ట‌రీ-ruturaj moeen ali helps as csk beat lsg by 12 runs ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Csk Vs Lsg: చెపాక్‌లో చెన్నై జోరు - ల‌క్నోపై థ్రిల్లింగ్ విక్ట‌రీ

CSK vs LSG: చెపాక్‌లో చెన్నై జోరు - ల‌క్నోపై థ్రిల్లింగ్ విక్ట‌రీ

Nelki Naresh Kumar HT Telugu
Apr 04, 2023 06:34 AM IST

CSK vs LSG: ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో చెన్నై బోణీ చేసింది. సోమ‌వారం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌పై 12 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని సాధించింది.

మెయిన్ అలీ
మెయిన్ అలీ

CSK vs LSG: ఐపీఎల్‌లో 2023 సీజ‌న్‌లో చెన్నై అదిరిపోయే బోణీ చేసింది. సోమ‌వారం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌పై 12 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 217 ప‌రుగులు చేయ‌గా ల‌క్ష్య‌ఛేద‌న‌లో పోరాడిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో 205 ర‌న్స్ చేసింది.

భారీ టార్గెట్‌తో సెకండ్ బ్యాటింగ్ చేప‌ట్టిన ల‌క్నోకు కైల్ మేయ‌ర్స్‌, రాహుల్ మెరుపు ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా కైల్ మేయ‌ర్స్ 22 బాల్స్‌లోనే ఎనిమిది ఫోర్లు రెండు సిక్స‌ర్ల‌తో 53 ప‌రుగులు చేసి ఆక‌ట్టుకున్నాడు. అత‌డి బ్యాటింగ్ విధ్వంసంతో ల‌క్నో ఐదు ఓవ‌ర్ల‌లోనే 70 ప‌రుగులు చేసింది.

నాలుగు ప‌రుగుల తేడాతో మేయ‌ర్స్‌, రాహుల్‌తో పాటు దీప‌క్ హుడా వికెట్ల‌ను కోల్పోవ‌డం ల‌క్నోను దెబ్బ‌తీసింది. నికోల‌స్ పూర‌న్ బ్యాట్ జులిపించినా సాధించాల్సిన స్కోరు ఎక్కువ‌గా ఉండ‌టంతో చివ‌ర‌కు ల‌క్నో ఇర‌వై ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు న‌ష్ట‌పోయి 205 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మైంది.

చెన్నై బౌల‌ర్ల‌లో మెయిన్ అలీ నాలుగు వికెట్ల‌తో రాణించ‌గా తుషార్ దేశ్‌పాండేకు రెండు వికెట్లు ద‌క్కాయి. అంత‌కుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ఇర‌వై ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల న‌ష్టానికి 217 ర‌న్స్ చేసింది. ఓపెన‌ర్లు రుతురాజ్ గైక్వాడ్‌, కాన్వే ధాటిగా ఆడి చెన్నైకి భారీ స్కోరు అందించారు.

రుతురాజ్ 31 బాల్స్‌లో నాలుగు సిక్స‌ర్లు, మూడు ఫోర్ల‌తో 57 ర‌న్స్ చేయ‌గా...కాన్వే 29 బాల్స్‌లో ఐదు ఫోర్లు, రెండు సిక్స‌ర్ల‌తో 47 ర‌న్స్ చేశారు. వీరితో పాటు శివ‌మ్ దూబే , రాయుడు త‌లో 27 ర‌న్స్ తో రాణించారు. చివ‌రి ఓవ‌ర్‌లో బ్యాటింగ్ దిగిన ధోనీ మూడు బాల్స్‌లోనే రెండు సిక్స‌ర్ల‌ తో 12 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు. ల‌క్నో బౌల‌ర్ల‌లో మార్క్‌వుడ్, ర‌వి బిష్ణోయ్ త‌లో మూడు వికెట్లు ద‌క్కాయి.