Rajugari Kodipulao teaser: టెలివిజన్‍లో ఎంతో ఫేమస్ అయిన ఈటీవీ ప్రభాకర్.. ప్రధాన పాత్రలో ఓ చిత్రం రూపొందుతోంది. రాజుగారి కోడిపలావ్ పేరుతో ఈ సినిమా వస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది. ఓ అడవిలో స్నేహితుల అడ్వెంచర్ నేపథ్యంతో ఈ చిత్రం రూపొందుతోంది. శివ కోనా ఈ మూవీ దర్శకత్వం వహిస్తున్నారు. కథ కూడా ఆయనదే. అనిల్ మోదుగ, శివ కోనా ఈ మూవీకి నిర్మాతలుగా ఉన్నారు. వివరాలివే..
రాజుగారి కోడిపలావ్ చిత్రంలో ఈటీవీ ప్రభాకర్, నేహా దేశ్‍పాండే, కునాల్ కౌశిక్, శివ కోనా, ప్రాచి థాకెర్, రమ్య దినేశ్, అభిలాశ్ బండారీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆరుగురు స్నేహితులు అడవికి వెకేషన్‍కు వెళ్లగా.. వారికి ఎదురైన షాకింగ్ ఘటనలు.. తప్పించుకునేందుకు వారు చేసిన ప్రయత్నాలే ఈ సినిమా కథగా ఉంది. జంగిల్ అడ్వెంచర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది.
రాజుగారి కోడిపలావ్ సినిమాకు ప్రవీణ్ మణి సంగీత దర్శకుడిగా ఉన్నాడు. సినిమాటోగ్రాఫర్‌గా పవన్ గుంటుకు పని చేస్తున్నాడు. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ ఆసక్తికరంగా ఉంది.
పెద్ద మీసాలు, పంచె కట్టుతో ఈటీవీ ప్రభాకర్ ఈ రాజుగారి కోడిపలావ్ టీజర్‌లో మాస్‍గా కనిపించారు. కూర్గ్, వయనాడ్‍ల్లోని అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఈ రాజుగారి పలావ్ సినిమా చిత్రీకరించారు. విజువల్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఓ వ్యక్తి కోడిని నరకటంతో ఈ టీజర్ మొదలవుతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్‍ను చిత్ర యూనిట్ ఇంకా ప్రకటించలేదు.