తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tollywood: ఆ ఒక్కటి అడక్కు, ప్రసన్న వదనం సినిమాల రన్‍టైమ్ ఇదే.. క్రిస్ప్‌గా అల్లరి నరేశ్ మూవీ

Tollywood: ఆ ఒక్కటి అడక్కు, ప్రసన్న వదనం సినిమాల రన్‍టైమ్ ఇదే.. క్రిస్ప్‌గా అల్లరి నరేశ్ మూవీ

30 April 2024, 17:16 IST

    • Aa Okkati Adakku vs Prasanna Vadanam: ఆ ఒక్కటి అడక్కు, ప్రసన్న వదనం సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. దీంతో ఆ చిత్రాల రన్‍టైమ్ వివరాలు బయటికి వచ్చాయి.
Tollywood: ఆ ఒక్కటి అడక్కు, ప్రసన్న వదనం సినిమాల రన్‍టైమ్ ఇదే.. క్రిస్ప్‌గా అల్లరి నరేశ్ మూవీ
Tollywood: ఆ ఒక్కటి అడక్కు, ప్రసన్న వదనం సినిమాల రన్‍టైమ్ ఇదే.. క్రిస్ప్‌గా అల్లరి నరేశ్ మూవీ

Tollywood: ఆ ఒక్కటి అడక్కు, ప్రసన్న వదనం సినిమాల రన్‍టైమ్ ఇదే.. క్రిస్ప్‌గా అల్లరి నరేశ్ మూవీ

Aa Okkati Adakku vs Prasanna Vadanam: అల్లరి నరేశ్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమా రిలీజ్‍కు రెడీ అయింది. యూత్‍కు కనెక్ట్ అయ్యేలా పెళ్లి కోసం పడే కష్టాల పాయింట్‍తో ఈ చిత్రం వస్తోంది. కొన్నాళ్లుగా సీరియస్ సబ్జెక్టుల దారిలో వెళ్లిన అల్లరి నరేశ్.. మళ్లీ తన మార్క్ కామెడీ ఎంటర్‌టైన్‍మెంట్‍తో ‘ఆ ఒక్కటి అడక్కు’ చిత్రం చేశారు. కమెడియన్ నుంచి హీరోగా మారిన సుహాస్ వరుస విజయాలతో ఫుల్ ఫామ్‍లో ఉన్నారు. సుహాస్ హీరోగా నటించిన ప్రసన్న వదనం కూడా రిలీజ్‍కు వచ్చేస్తోంది. మే 3వ తేదీనే ఆ ఒక్కటి అడక్కు, ప్రసన్న వదనం చిత్రాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద అల్లరి నరేశ్, సుహాస్ పోటీ పడనున్నారు. ఈ చిత్రాల సెన్సార్ కూడా పూర్తయింది.

ట్రెండింగ్ వార్తలు

NTR Neel Update: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాపై కీలక అప్‍డేట్ వచ్చేసింది.. షూటింగ్ ఎప్పటి నుంచో చెప్పిన టీమ్

OTT Movies This Week: ఓటీటీలో ఈ వారం సినీ పండుగ.. ఏకంగా 21 సినిమాలు.. కానీ 2 మాత్రమే చూడదగినవి.. ఏంటంటే?

Payal Rajput: వారు వేదిస్తున్నారు: లీగల్ యాక్షన్‍కు రెడీ అయిన పాయల్ రాజ్‍పుత్

Guppedantha Manasu May 20th Episode: గుప్పెడంత మనసు- శైలేంద్రపై రాజీవ్ హత్యాయత్నం- ధరణి కాళ్లు పట్టుకున్న భర్త

ఆ ఒక్కటి అడక్కు రన్‍టైమ్

ఆ ఒక్కటి అడక్కు సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. ఈ మూవీ రన్‍టైమ్ 2 గంటల 14 నిమిషాలు (134 నిమిషాలు)గా ఉంది. సెన్సార్ సర్టిఫికేట్ ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి.

134 నిమిషాలు అంటే క్రిస్ప్ రన్‍టైమే. ఆ ఒక్కటి అడక్కు చిత్రం ఎంటర్‌టైనింగ్ మూవీ కావడంతో ఈ నిడివి సరిగ్గా సూటవుతుంది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే.. మంచి హిట్ కొట్టే ఛాన్స్ ఉంది. సుమారు మూడేళ్ల తర్వాత మళ్లీ తన బ్రాండ్ అయిన కామెడీ జానర్‌కు అల్లరి నరేశ్ రావటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.

ఆ ఒక్కటి అడక్కు మూవీలో అల్లరి నరేశ్ సరసన ఫారియా అబ్దుల్లా హీరోయిన్‍గా నటించారు. వెన్నెల కిశోర్, జామీ లేవర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ, హరితేజ కీరోల్స్ చేశారు. మల్లీ అంకం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఓసారి వాయిదా పడిన ఈ మూవీ.. ఎట్టకేలకు మే 3వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.

ప్రసన్న వదనం

సుహాస్ హీరోగా నటించిన ప్రసన్న వదనం సినిమా ఫేస్ బ్లైండ్‍నెస్ అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందింది. పోస్టర్లు, ట్రైలర్ ఇలా అన్నీ ఈ చిత్రంపై ఫుల్ హైప్ పెంచేశాయి. ఈ ఏడాది అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్‍తో హిట్ కొట్టి సుహాస్ కూడా ఫామ్‍లో ఉన్నారు. దీంతో ‘ప్రసన్న వదనం’పై భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రసన్న వదనం సినిమా సెన్సార్ పనులు కంప్లీట్ అయ్యాయి. ఈ థ్రిల్లర్ మూవీ రన్‍టైమ్ 2 గంటల 26 నిమిషాలు (146 నిమిషాలు)గా ఉంది. యూ/ఏ సర్టిఫికేషన్‍ను ఈ చిత్రానికి ఇచ్చింది సెన్సార్ బోర్డు.

ప్రసన్న వదనం చిత్రానికి అర్జున్ వైకే దర్శకత్వం వహించగా.. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ఈ మూవీలో పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నందు, వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత, కుషాలినీ కీరోల్స్ చేశారు. లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్ ఈ మూవీని నిర్మిచింది. మే 3వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం