Virupaksha Pan India Release: పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమైన విరూపాక్ష.. భయపెట్టేందుకు రెడీ-virupaksha is ready to release pan india wide on may 5th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Virupaksha Pan India Release: పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమైన విరూపాక్ష.. భయపెట్టేందుకు రెడీ

Virupaksha Pan India Release: పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమైన విరూపాక్ష.. భయపెట్టేందుకు రెడీ

Virupaksha Pan India Release: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. మే 5న ఈ సినిమా ఇతర భాషల్లోనూ విడుదల కానుంది.

విరూపాక్ష పాన్ ఇండియా రిలీజ్

Virupaksha Pan India Release: సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమా ఇటీవల విడుదలై సూపర్ హిట్‌ను అందుకుంది. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ బ్లాక్‌బాస్టర్ హిట్‌గా దూసుకెళ్తోంది. ఏప్రిల్ 21న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు కాసుల వర్షం కురుస్తోంది. కార్తిక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ తన నటనతో ఆకట్టుకుంది. సాయి తేజ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచిన ఈ మూవీకి సంబంధించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది.

విరూపాక్ష చిత్రాన్ని పాన్ఇండియా వ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ప్రస్తుతం తెలుగులో మాత్రం రిలీజ్ చేసిన ఈ చిత్రాన్ని ఇతర భాషల్లోనూ విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని సాయి ధరమ్ తేజ్ కన్ఫార్మ్ చేశారు. #AskSDT అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్విటర్ ఇంటరాక్షన్‌లో భాగమైన సాయి ధరమ్ తేజ్.. విరూపాక్ష చిత్రాన్ని పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

మే 5న విరూపాక్ష చిత్రాన్ని పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తమిళంలో ప్రముఖ నిర్మాత జ్ఞాన్‌వేల్ రాజా రిలీజ్ చేస్తుండగా.. హిందీ వెర్షన్‌ను గోల్డ్ మైన్స్ పతాకంపై మనీష్ విడుదల చేయనున్నారు. మలయాళంలో ఈ4 మీడియా రిలీజ్ చేయనుంది. తెలుగులో సూపర్ హిట్‌ అయిన ఈ చిత్రం కోసం ఇతర భాషల ప్రజలు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సస్పెన్స్ హర్రర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై సినిమాను నిర్మించారు. సుకుమార్ ఈ చిత్రానికి స్కీన్ ప్లే అందించారు. కార్తిక్ వర్మ దండు దర్శకత్వం వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.