తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Siddharth Roy Ott: బోల్డ్ రొమాంటిక్ మూవీ సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి రానుందంటే..

Siddharth Roy OTT: బోల్డ్ రొమాంటిక్ మూవీ సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి రానుందంటే..

30 April 2024, 21:07 IST

    • Siddharth Roy OTT Release Date: సిద్ధార్థ్ రాయ్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. దీపక్ సరోజ్ ఈ మూవీలో హీరోగా నటించారు. బోల్డ్ సీన్లతో ఉన్న ఈ రొమాంటిక్ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.
Siddharth Roy OTT: బోల్డ్ రొమాంటిక్ మూవీ సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి రానుందంటే..
Siddharth Roy OTT: బోల్డ్ రొమాంటిక్ మూవీ సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి రానుందంటే..

Siddharth Roy OTT: బోల్డ్ రొమాంటిక్ మూవీ సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి రానుందంటే..

Siddharth Roy OTT Release Date: సిద్ధార్థ్ రాయ్ సినిమా రిలీజ్‍కు ముందు చాలా హైప్ తెచ్చుకుంది. బోల్డ్ సీన్లు, డైలాగ్‍లతో ఉన్న ఆ మూవీ ట్రైలర్ క్రేజీ రెస్పాన్స్ తెచ్చుకుంది. అర్జున్ రెడ్డిలా ఈ మూవీ అనిపిస్తోందనే కామెంట్లు వచ్చాయి. సిద్ధార్థ్ రాయ్ సినిమా ఫిబ్రవరి 23వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. చైల్డ్ ఆర్టిస్టుగా 'అతడు' సహా చాలా చిత్రాల్లో చేసిన దీపక్ సరోజ్ ఈ మూవీలో హీరోగా నటించారు. అయితే, హైప్‍కు తగ్గట్టు థియేటర్లలో పెద్దగా కలెక్షన్లను సిద్ధార్థ్ రాయ్ దక్కించుకోలేదు. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

ట్రెండింగ్ వార్తలు

Deepika Padukone Baby Bump: దీపికా బేబీ బంప్.. భర్తతో కలిసి ఓటేయడానికి వస్తూ చూపించిన బ్యూటీ

Laapataa Ladies: అందరినీ ఆలోచింపజేసేలా మంజూ మాయ్ చెప్పిన పవర్‌ఫుల్ హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ ఇవి.. మిస్ అవకండి

Devara Fear Song Lyrics: దేవర మూవీ ఫియర్ సాంగ్ లిరిక్స్ ఇవే.. అదరగొడుతున్న అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్

Anuvanuvuu song lyrics: సూపర్ హిట్ మెలోడీ అణువణువూ సాంగ్ లిరిక్స్ ఇవే.. నంబర్ వన్ సింగర్ పాడిన తెలుగు పాట

స్ట్రీమింగ్ డేట్ ఇదే

సిద్ధార్థ్ రాయ్ సినిమా మే 3వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆహా నేడు అధికారికంగా వెల్లడించింది. “పేరు సిద్ధార్థ్ రాయ్. ఈ క్లిష్టమైన మనిషిని చూసేందుకు రెడీ అవండి. సిద్ధార్థ్ రాయ్ మే 3న ప్రీమియర్ కానుంది” అని ఆహా నేడు (ఏప్రిల్ 30) ట్వీట్ చేసింది.

ఎట్టకేలకు థియేటర్లలో రిలీజైన సుమారు 70 రోజుల తర్వాత సిద్ధార్థ్ రాయ్ చిత్రం ఆహా ఓటీటీలోకి వచ్చేస్తోంది. మార్చిలోనే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుందని బజ్ నడిచింది. అయితే, అలా జరగలేదు. ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు మే 3వ తేదీన ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకురానుందని ఆహా.

సిద్ధార్థ్ రాయ్ మూవీ గురించి..

సిద్ధార్థ్ రాయ్ చిత్రానికి వి.యశస్వి దర్శకత్వం వహించారు. బోల్డ్ సబ్జెక్టుతో రొమాంటిక్ హార్డ్ హిట్టింగ్ చిత్రంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో దీపక్ సరోజ్ హీరోగా నటించారు. అతడి సరసన తన్వి నేగి హీరోయిన్‍గా చేశారు. ఈ మూవీ ట్రైలర్ రిలీజైనప్పుడు అందులోని బోల్డ్ సీన్లు, డైలాగ్స్, హీరో క్యారెక్టరైజేషన్ చూసి అర్జున్ రెడ్డి చిత్రాన్ని గుర్తు చేసిందనే కామెంట్లు వచ్చాయి. అయితే, సిద్ధార్థ్ రాయ్ డిఫరెంట్‍గా ఉంటుందని మేకర్స్ చెబుతూ వచ్చారు. అయితే, థియేటర్లలో ఈ మూవీ అంచనాలు వేసిన స్థాయిలో ఆడలేదు.

సిద్ధార్థ్ రాయ్ మూవీలో దీపక్, తన్వితో పాటు ఆనంద్, నందిని, కల్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, కీర్తన కీరోల్స్ చేశారు. శ్రీరాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ విహిన్ క్రియేషన్స్ బ్యానర్లపై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. రధన్ ఈ మూవీకి సంగీతం అందించగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేశారు.

సిద్ధార్థ్ రాయ్ చిత్రం కోసం మూవీ టీమ్ ప్రమోషన్లను బాగానే చేసింది. బోల్డ్‌గా ఉన్న పోస్టర్, టీజర్, ట్రైలర్ మంచి బజ్‍ను తెచ్చిపెట్టాయి. అయితే, ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీపక్ సరోజ్, తన్వి పర్ఫార్మెన్స్‌కు ప్రశంసలు దక్కినా.. కథ, కథనాలపై నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రం అనుకున్న రేంజ్‍లో వసూళ్లను దక్కించుకోలేకపోయింది.

సిద్దార్థ్ రాయ్ స్టోరీ లైన్

ఎమోషన్లు లేకుండా లాజిక్‍లను మాత్రమే ఫాలో అవుతూ.. ఇష్టమొచ్చినట్టుగా ఉండే సిద్ధార్థ్ రాయ్ (దీపక్ సరోజ్) పాత్ర చుట్టూ ఈ మూవీ సాగుతుంది. తినడం, నిద్రపోవడం, కోరికలను తీర్చుకోవడాన్నే అతడు ఇష్టపడుతుంటాడు. ఇతర ఎమోషన్లను పట్టించుకోడు. అయితే, తన జీవితంలోకి ఇందు (తన్వి నేగి) రావడంతో ఎమోషన్లను కూడా సిద్ధార్థ్ పట్టించుకుంటాడు. ఆమెను ప్రేమిస్తాడు. ఆ తర్వాత సిద్ధార్థ్ రాయ్ జీవితం ఎలా మారింది? వారి ప్రేమ సఫలమైందా? అనేదే సిద్ధార్థ్ రాయ్ మూవీలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. మే 3వ తేదీన నుంచి ఆహా ఓటీటీలోకి ఈ చిత్రాన్ని చూడొచ్చు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం