Siddharth Roy Trailer: అతడు సినిమాలో బ్రహ్మానందం కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ అప్పట్లో పాపులర్ అయ్యాడు. ఇప్పుడు అతడు హీరోగా మారాడు. దీపక్ సరోజ్ హీరోగా ‘సిద్ధార్థ్ రాయ్’ సినిమా వస్తోంది. ఈ మూవీ ట్రైలర్ నేడు రిలీజ్ అయింది. ఈ చిత్రానికి యశస్వి దర్శకత్వం వహించాడు. సిద్ధార్థ్ రాయ్ ట్రైలర్ బోల్డ్ సీన్లతో నిండిపోయింది.
నాలాంటి ప్రేమ డిఫరెంట్ అనే డైలాగ్ తర్వాత సిద్ధార్థ్ రాయ్ (దీపక్ సరోజ్) గట్టిగా అరిచే షాట్‍తో సిద్ధార్థ్ రాయ్ మూవీ ట్రైలర్ షురూ అయింది. వర్జినిటీని 17 సంవత్సరాలకు కోల్పోయానంటూ ఓ డైలాగ్ ఉంది. “నేను లవ్ కోసం కాదు.. లవ్ మేకింగ్ కోసం” అని సిద్ధార్థ్ చెప్పే డైలాగ్‍తో ఈ మూవీ ఎంత బోల్డ్‌గా ఉండనుందో అర్థమవుతుంది. అమ్మాయిని సిగరెట్ ఉందా అని అడుగుతాడు సిద్ధార్థ్.. లేదంటే కండోమ్ ఉందా అంటాడు.
సిద్ధార్థ్ రాయ్ ట్రైలర్‌లో చాలా లిప్‍లాక్ సీన్లు ఉన్నాయి. ఈ మూవీలో తన్వి నేగీ హీరోయిన్‍గా నటించారు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని వ్యక్తిగా సిద్ధార్థ్ రాయ్ ఉంటాడు. అతడి ఎమోషన్‍ను కంట్రోల్ చేసేందుకు హీరోయిన్ ప్రయత్నిస్తుంటుంది. భవిష్యత్తులో ప్రపంచం నాశమయ్యేందుకు ప్యాండమిక్‍కో.. వాతావరణ విపత్తు కారణం కాబోదని, ఎమోషన్లే కారణమవుతాయనే డైలాగ్ ఉంది. ప్రేమలో విఫలమై.. సిద్ధార్థ్ రాయ్ మతి గతి తప్పుతుందనేలా ట్రైలర్లో ఉంది.
సిద్ధార్థ్ రాయ్ ట్రైలర్ అర్జున్ రెడ్డి సినిమాను గుర్తు చేస్తోంది. అర్జున్ రెడ్డి నుంచే స్ఫూర్తి తీసుకొని ఈ మూవీ చేసినట్టు అనిపిస్తోంది. హీరో క్యారెక్టరైజేషన్ దాదాపు అలాగే ఉంది. అయితే, అర్జున్ రెడ్డి రేంజ్‍లో సిద్ధార్థ్ రాయ్ మూవీ ఆకట్టుకనేలా ఉంటుందో లేదో రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది.
అర్జున్ రెడ్డి చిత్రానికి సంగీతం అందించిన ‘రధనే’ సిద్ధార్థ్ రాయ్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. దీంతో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ పరంగానూ అర్జున్ రెడ్డి ఛాయలు ఉన్నాయి. సిద్ధార్థ్ రాయ్ మూవీ రిలీజ్ డేట్‍ను మేకర్స్ ఇంకా ఖరారు చేయలేదు.
సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో దీపక్ సరోజ్, తన్వి నేగి హీరోహీరోయిన్లుగా నటించగా.. ఆనంద్, కల్యాణి నటరాజ్, మాథ్యూ వర్గీస్, నందినీ, కీర్తన కీలకపాత్రలు చేశారు. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే బాధ్యలను కూడా వి.యశస్వి చేశాడు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్, విహిన్ క్రియేషన్స్ బ్యానర్లు నిర్మించాయి. జయ అడపాక ఈ మూవీకి నిర్మాతగా ఉన్నారు. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ చేశారు.
దీపక్ సరోజ్ ఈ సినిమాలో అద్భుతంగా నటించాడని ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో దర్శకుడు యశస్వి చెప్పాడు. తెలుగు సినిమా చరిత్రలో ఒకానొక బెస్ట్ డెబ్యూట్ పర్ఫార్మెన్స్‌గా నిలిచిపోతుందని అన్నాడు. ట్రైలర్ చూస్తేనే ఇలా ఉందని, సినిమా చూస్తే పర్ఫార్మెన్స్ బాంబ్ బ్లాస్ట్ లా ఉంటుందని హైప్ ఇచ్చాడు.
సిద్ధార్థ్ రాయ్ సినిమా ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే, తేదీని మూవీ టీమ్ ఇంకా ఖరారు చేయలేదు. ఈ విషయంలో త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ట్రైలర్‌తో అయితే క్యూరియాసిటీని ఈ చిత్రం పెంచింది.