తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pathaan In 1000 Crores Club: పఠాన్@1000 కోట్లు.. ఈ ఘనత సాధించిన ఐదో ఇండియన్ సినిమాగా రికార్డు

Pathaan in 1000 crores club: పఠాన్@1000 కోట్లు.. ఈ ఘనత సాధించిన ఐదో ఇండియన్ సినిమాగా రికార్డు

Hari Prasad S HT Telugu

21 February 2023, 16:34 IST

    • Pathaan in 1000 crores club: పఠాన్ 1000 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ ఘనత సాధించిన ఐదో ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.
పఠాన్ మూవీలో షారుక్ ఖాన్
పఠాన్ మూవీలో షారుక్ ఖాన్ (HT_PRINT)

పఠాన్ మూవీలో షారుక్ ఖాన్

Pathaan in 1000 crores club: సౌత్ సినిమాల దెబ్బకు బాలీవుడ్ కుదేలవుతున్న సమయంలో దేశంలోనే అతి పెద్ద సినిమా ఇండస్ట్రీని రక్షించింది పఠాన్ మూవీ. బాలీవుడ్ పనైపోలేదని ఈ సినిమా నిరూపించింది. ఆ ఇండస్ట్రీ బాద్ షా షారుక్ ఖాన్ కూడా నాలుగేళ్ల తర్వాత నటించిన సినిమా కావడంతో పఠాన్ పై ముందు నుంచీ భారీ అంచనాలే ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

Kannappa Prabhas: కన్నప్ప షూటింగ్‌లో ప్రభాస్.. ఆ మూడు రోజుల్లోనే పూర్తి చేయాలంటూ..

Koratala Siva on Devara: నాకు, అభిమానులకు స్పెషల్ సినిమా: దేవరపై దర్శకుడు కొరటాల శివ.. అప్‍డేట్లపై కామెంట్

Manjummel Boys OTT: ఓటీటీలో మంజుమ్మల్ బాయ్స్ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తోందంటే!

అడ్వాన్స్ బుకింగ్స్ నుంచి సినిమా రిలీజైన తర్వాత కూడా రికార్డుల పరంపర కొనసాగింది. జనవరి 25న రిలీజైన ఈ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు రాబట్టింది. ఓ స్టార్ హీరోకు బెస్ట్ కమ్‌బ్యాక్ మూవీగా నిలిచింది. తాజాగా రూ.1000 కోట్ల అరుదైన క్లబ్ లో చేరింది. షారుక్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచిన పఠాన్.. తాజాగా ఈ 1000 కోట్ల మైలురాయిని అందుకుంది.

ఈ ఘనత సాధించిన ఐదో ఇండియన్ సినిమాగా నిలవడం విశేషం. పఠాన్ కంటే ముందు దంగల్, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు రూ.1000 కోట్లకుపైగా వసూలు చేశాయి. దంగల్ ఇప్పటికే అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా కొనసాగుతుండగా.. బాహుబలి 2 రెండోస్థానంలో ఉంది.

పఠాన్ మూవీని సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో షారుక్ సరసన దీపికా పదుకోన్ నటించింది. షారుక్ రా ఏజెంట్ గా కనిపించాడు. జాన్ అబ్రహం విలన్ లా నటించాడు. ఈ స్పై థ్రిల్లర్ మూవీని యశ్ రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కించింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.