తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pathaan Box Office Collections: పఠాన్ ప్రభంజనం.. అదిరిపోయో వసూళ్లు సరికొత్త రికార్డు

Pathaan Box Office Collections: పఠాన్ ప్రభంజనం.. అదిరిపోయో వసూళ్లు సరికొత్త రికార్డు

13 February 2023, 14:08 IST

    • Pathaan Box Office Collections: షారుఖ్ నటించిన పఠాన్ సినిమా అదిరిపోయే వసూళ్లతో అదరగొడుతోంది. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 950 కోట్ల వసూళ్లతో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
పఠాన్ కలెక్షన్లు
పఠాన్ కలెక్షన్లు (HT_PRINT)

పఠాన్ కలెక్షన్లు

Pathaan Box Office Collections: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ చాలా రోజుల తర్వాత అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత పఠాన్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఈ స్టార్.. ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు. పాన్ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద విజయంగా ఈ సినిమా నిలిచింది. గత నెలలో రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Samantha: ‘అది ఫేక్’: సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమంత ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..

Chitram Choodara OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

Aa Okkati Adakku Collections: బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్కటి అడక్కు మూవీ జోరు.. తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువగా..

కేవలం విడుదలైన 19 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 950 కోట్ల మార్కును అందుకుంది. రూ.1000 కోట్ల మైలురాయిని అందుకునేందుకు అడుగు దూరంలో ఉంది. రెండు వీకెండ్లు పూర్తయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జోరు కొనసాగుతూనే ఉంది. ఈ అదివారం కూడా ఈ చిత్రం రూ.12.50 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

భారత్‌తో పాటు విదేశాల్లోనూ ఈ సినిమా కాసుల సునామీని సృష్టిస్తోంది. ఇప్పటికే యూఎస్, యూరప్ లాంటి దేశాల్లో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విపరీత ఆదరణ లభిస్తోంది. రూ.1000 కోట్ల క్లబ్‌ను సులభంగా చేరుకునేలా ఉంది. బాహుబలి రికార్డును కూడా బ్రేక్ చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ విడుదల కానుంది. దీపికా పదుకొణె హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాలో జాన్ అబ్రహం కీలక పాత్ర పోషించారు. విశాల్-శేఖర్ సంగీత దర్శకత్వం వహించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.