Pathaan Breaks RRR Record: ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్ చేసిన పఠాన్.. కలెక్షన్ల వర్షం-pathaan breaks rrr box office record in usa ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pathaan Breaks Rrr Record: ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్ చేసిన పఠాన్.. కలెక్షన్ల వర్షం

Pathaan Breaks RRR Record: ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్ చేసిన పఠాన్.. కలెక్షన్ల వర్షం

Hari Prasad S HT Telugu
Feb 07, 2023 05:12 PM IST

Pathaan Breaks RRR Record: ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్ చేసింది పఠాన్ మూవీ. రిలీజైన రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ మూవీ.. అమెరికాలో కలెక్షన్ల పరంగా రాజమౌళి మూవీ రికార్డును బ్రేక్ చేయడం విశేషం.

పఠాన్ మూవీలో షారుక్ ఖాన్
పఠాన్ మూవీలో షారుక్ ఖాన్

Pathaan Breaks RRR Record: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ దెబ్బకు బాక్సాఫీస్ రికార్డులన్నీ తారుమారవుతున్నాయి. అతడు నాలుగేళ్ల తర్వాత నటించిన మూవీ పఠాన్ ఇప్పుడు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిలీజ్ కు ముందే ఎంతో హైప్ రావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే ఈ మూవీ రికార్డుల పరంపర మొదలైంది. ఆ తర్వాత సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ రావడంతో ఇక అడ్డు లేకుండా దూసుకెళ్తోంది.

తాజాగా అమెరికాలో పఠాన్ మూవీ ఆర్ఆర్ఆర్ రికార్డును బ్రేక్ చేయడం విశేషం. షారుక్, దీపికా నటించిన ఈ సినిమా.. ఇప్పటి వరకూ అమెరికాలో 1.45 కోట్ల డాలర్లు వసూలు చేసింది. అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీస్ లిస్ట్ లో పఠాన్ రెండో స్థానంలో నిలిచింది. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ యూఎస్ఏలో 1.43 కోట్ల డాలర్లు వసూలు చేసింది.

ప్రస్తుతం అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీ రికార్డు బాహుబలి 2 పేరిట ఉంది. ఈ సినిమా 2.05 కోట్ల డాలర్లు వసూలు చేయడం విశేషం. అయితే పఠాన్ ఆ సినిమా రికార్డు బ్రేక్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. పఠాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.900 కోట్ల వరకూ వసూలు చేసింది. ఇండియాలోనూ అత్యంత వేగంగా రూ.300 కోట్లు వసూలు చేసిన హిందీ మూవీగా కూడా పఠాన్ రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసిన పఠాన్ మూవీని సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీలో విలన్ పాత్రలో జాన్ అబ్రహం నటించాడు. రిలీజ్ కు ముందే బాయ్‌కాట్ పిలుపులు ఎదుర్కొన్న ఈ మూవీ.. రిలీజ్ తర్వాత మాత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. హిందీతోపాటు తెలుగు, తమిళంలలోనూ పఠాన్ రిలీజైన విషయం తెలిసిందే.

Whats_app_banner

సంబంధిత కథనం