Allu Arjun in Jawan: క్రేజీ అప్‌డేట్.. షారుక్ ఖాన్‌ జవాన్ మూవీలో అల్లు అర్జున్!-allu arjun in jawan as the director atlee approached the stylish star for a guest role ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Allu Arjun In Jawan As The Director Atlee Approached The Stylish Star For A Guest Role

Allu Arjun in Jawan: క్రేజీ అప్‌డేట్.. షారుక్ ఖాన్‌ జవాన్ మూవీలో అల్లు అర్జున్!

అల్లు అర్జున్, షారుక్ ఖాన్
అల్లు అర్జున్, షారుక్ ఖాన్

Allu Arjun in Jawan: క్రేజీ అప్‌డేటే ఇది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్‌ నటిస్తున్న జవాన్ మూవీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కనిపించనున్నట్లు ఓ బజ్ నడుస్తోంది. ఇదే నిజమైతే ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలి.

Allu Arjun in Jawan: కింగ్ ఖాన్ షారుక్ ప్రస్తుతం తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ పఠాన్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. జీరో మూవీ తర్వాత నాలుగేళ్లకు అతడు నటించిన సినిమా కావడంతో దీనిపై మొదటి నుంచీ విపరీతమైన బజ్ క్రియేటైంది. అందుకు తగినట్లే అభిమానుల అంచనాలను కూడా అందుకోవడంతో పఠాన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది.

ట్రెండింగ్ వార్తలు

ఇక ఇప్పుడతడు తన నెక్ట్స్ మూవీ జవాన్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తెరి మూవీ ఫేమ్ అట్లీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ క్రేజీ అప్‌డేట్ వస్తోంది. జవాన్ మూవీలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి అతన్ని డైరెక్టర్ అట్లీ కలిశాడట. కానీ అల్లు అర్జున్ మాత్రం ఇంకా ఈ రోల్ ను ఫైనలైజ్ చేయలేదని వార్తలు వస్తున్నాయి.

జవాన్ కూడా పాన్ ఇండియా మూవీగా వస్తోంది. ఒకవేళ షారుక్ తో కలిసి అల్లు అర్జున్ నటించడం నిజమే అయితే మాత్రం ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలి. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ మూవీస్ లో బాలీవుడ్ స్టార్లు, అక్కడి సినిమాల్లో మన స్టార్లు నటించడం కామనైపోయింది. ఇప్పుడు షారుక్, అల్లు అర్జున్ ఒకే స్క్రీన్ పై కనిపిస్తే మాత్రం బాక్సాఫీస్ బద్ధలైపోవడం ఖాయం.

ఈ మధ్యే లాల్ సింగ్ చద్ధా మూవీలో ఆమిర్ ఖాన్ తోపాటు నాగ చైతన్య నటించిన సంగతి తెలుసు కదా. ఇక చిరంజీవి గాడ్‌ఫాదర్ మూవీలో సల్మాన్ నటించాడు. రానున్న షారుక్ ఖాన్ మూవీలో వెంకటేశ్, రామ్ చరణ్ నటించడం విశేషం. ఇలా మెల్లగా బాలీవుడ్, టాలీవుడ్ దగ్గరవుతున్నాయి. జవాన్ టీమ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ తెరకెక్కిస్తోంది. జవాన్ మూవీలో షారుక్ సరసన నయనతార నటిస్తోంది. అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.