Laal Singh Chaddha Number 1 in Netflix: అక్కడ లాల్ సింగ్ చడ్డా అదరగొడుతోంది.. నెంబర్ వన్ స్థానంలో ఆమీర్ చిత్రం-aamir khan laal singh chaddha becomes number 1 on netflix in india ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Laal Singh Chaddha Number 1 In Netflix: అక్కడ లాల్ సింగ్ చడ్డా అదరగొడుతోంది.. నెంబర్ వన్ స్థానంలో ఆమీర్ చిత్రం

Laal Singh Chaddha Number 1 in Netflix: అక్కడ లాల్ సింగ్ చడ్డా అదరగొడుతోంది.. నెంబర్ వన్ స్థానంలో ఆమీర్ చిత్రం

Maragani Govardhan HT Telugu
Oct 14, 2022 03:09 PM IST

Laal Singh Chaddha Number 1 in Netflix: ఆమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్ఢా నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతోంది. ఈ సినిమా థియేటర్లలో పెద్దగా అలరించనప్పటికీ ఓటీటీ వేదికలో మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

లాల్ సింగ్ చడ్డా
లాల్ సింగ్ చడ్డా (Twitter)

Laal Singh Chaddha Number 1 in Netflix: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ ఈ ఏడాది నటించిన చిత్రం లాల్ సింగ్ చడ్డా. ఎన్నో అంచనాల నడుమ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. చిత్రంపై నెగిటివ్ టాక్ రావడమే కాకుండా.. వసూళ్ల పైనా ప్రభావం చూపింది. కనీసం రూ.100 కోట్ల మార్కును కూడా అందుకోలేకపోవడం గమనార్హం. అంతేకాకుండా చిత్రంపై అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే థియేటర్లలో పెద్దగా అలరించని ఈ సినిమా ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది.

ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న లాల్ సింగ్ చడ్డా చిత్రం టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ప్రేక్షకులు విపరీతంగా ఈ సినిమాను వీక్షిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ అధికారిక గణాంకాల ప్రకారం వ్యూయర్షిప్ ప్రకారం ఈ చిత్రం భారత్‌లో నెంబర్ వన్ స్థానంలో.. ప్రపంచ వ్యాప్తంగా ఆంగ్లేతర సినిమాల్లో రెండో స్థానంలో నిలిచింది.

నెట్‌ఫ్లిక్స్ ఇచ్చిన డేటా ప్రకారం ఈ సినిమాను 6.63 మిలియన్(66.3 లక్షలు) గంటల స్ట్రీమింగ్ టైమ్‌ను అందుకుంది. ఈ సినిమా కేవలం భారత్‌లోనే విదేశాల్లోనూ ఓటీటీ వేదికగా ఎక్కువ మంది చూస్తున్న చిత్రంగా నిలవడం ఆసక్తికరం. దాదాపు 13 దేశాల్లో లాల్ సింగ్ చడ్ఢా టాప్-10 ట్రెండింగ్‌ జాబితాలో ఉంది. బంగ్లాదేశ్, సింగపూర్, ఒమన్, శ్రీలంక, బహ్రేయిన్, మలేషియా, మారిషస్, యూఏఈ తదితర దేశాల్లో ట్రెండింగ్ లిస్ట్‌లో ఉంది.

ట్విటర్‌లోనూ ఈ చిత్రంపై చర్చ జరుగుతోంది. చాలా మంది నెటిజన్లు ఈ సినిమాలోని చివరి సన్నివేశాన్ని మైక్రోబ్లాగింగ్ సైట్‌లో షేర్ చేస్తున్నారు. సినిమా ఎలా ఉన్నప్పటికీ ఓటీటీ వేదికగా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు దాదాపు రూ.88 కోట్ల వసూళ్లను అందుకుంది.

రూ.180 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. కరీనాతో పాటు మోనా సింగ్, నాగచైతన్య తదితరులు నటించారు. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో నాగచైతన్య బాలరాజు అనే మిలిటరీ అధికారి పాత్రలో నటించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం