Laal Singh Chaddha in OTT: చడీ చప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన లాల్‌ సింగ్‌ చడ్డా-laal singh chaddha in ott as netflix is streaming the movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Laal Singh Chaddha In Ott: చడీ చప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన లాల్‌ సింగ్‌ చడ్డా

Laal Singh Chaddha in OTT: చడీ చప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన లాల్‌ సింగ్‌ చడ్డా

HT Telugu Desk HT Telugu
Oct 06, 2022 11:16 AM IST

Laal Singh Chaddha in OTT: చడీ చప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది లాల్‌ సింగ్‌ చడ్డా మూవీ. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది రిలీజ్‌ అయిన ఈ పాన్‌ ఇండియా మూవీ బాక్సాఫీస్‌ దగ్గర దారుణంగా బోల్తాపడిన విషయం తెలిసిందే.

నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమ్ అవుతున్న లాల్ సింగ్ చడ్డా మూవీ
నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమ్ అవుతున్న లాల్ సింగ్ చడ్డా మూవీ

Laal Singh Chaddha in OTT: బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ఖాన్‌ నటించిన లాల్‌ సింగ్‌ చడ్డా మూవీ రిలీజ్‌కు ముందు ఎంతో హడావిడి చేసింది. పాన్‌ ఇండియా మూవీ అంటూ దేశవ్యాప్తంగా భారీగా ప్రమోషన్లు నిర్వహించారు. కానీ మేకర్స్‌ శ్రమ వృథా అయింది. సినిమాకు నెగటివ్‌ రివ్యూలు రావడం, బాయ్‌కాట్ పిలుపుల మధ్య బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడింది.

దీంతో ఇప్పుడీ లాల్‌ సింగ్ చడ్డా చడీ చప్పుడు కాకుండా ఓటీటీలోకి వచ్చేశాడు. థియేటర్లలో రిలీజైన ఆరు నెలల తర్వాతగానీ ఓటీటీలో రిలీజ్‌ చెయ్యమని చెప్పిన మేకర్స్‌ ఇప్పుడు రెండు నెలలు కూడా కాకుండానే ఓకే చెప్పేశారు. ఈ సినిమా ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. ఈ విషయాన్ని గురువారం ఉదయమే మేకర్స్‌ వెల్లడించడం విశేషం.

హాలీవుడ్‌లో వచ్చిన ఆస్కార్‌ విన్నింగ్‌ మూవీ ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌గా వచ్చిన లాల్‌ సింగ్‌ చడ్డాను అద్వైత్‌ చందన్‌ డైరెక్ట్‌ చేశాడు. ఈ సినిమాలో ఆమిర్ ఖాన్‌, కరీనా కపూర్‌తోపాటు నాగచైతన్య కూడా నటించిన విషయం తెలిసిందే. లాల్‌ సింగ్‌ చడ్డా తమ ఓటీటీలో స్ట్రీమ్‌ అవుతున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో వెల్లడించింది.

"మీ పాప్‌కార్న్‌, గోల్‌గప్పాలు సిద్ధంగా ఉంచుకోండి. ఎందుకంటే లాల్‌ సింగ్‌ చడ్డా స్ట్రీమ్‌ అవుతోంది" అనే క్యాప్షన్‌తో ఈ పోస్ట్‌ చేసిన నెట్‌ఫ్లిక్స్‌.. ఆమిర్‌ఖాన్‌, కరీనా, మోనా సింగ్‌, ఆమిర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్‌, వయాకామ్‌ 18, పారామౌంట్‌ పిక్స్‌ను ట్యాగ్‌ చేసింది. ఈ సినిమా రిలీజ్‌ సమయంలో ఆమిర్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. ఆరు నెలల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేస్తామని చెప్పాడు. ఆగస్ట్‌ 11న ఈ సినిమా రిలీజైన విషయం తెలిసిందే.

లాల్‌ సింగ్‌ చడ్డా గురించి

హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ ఆధారంగా తెర‌కెక్కిన సినిమా ఇది. ఒరిజినల్ సినిమాను పూర్తిగా మ‌క్కికి మ‌క్కీ ఫాలో అయ్యాడు ద‌ర్శ‌కుడు. ఆమిర్ క్యారెక్ట‌రైజేష‌న్ మొద‌లుకొని అతడి ల‌వ్‌స్టోరీ, నాగ‌చైత‌న్య‌తో ఫ్రెండ్‌షిప్ ఇలా చాలా వ‌ర‌కు ఫారెస్ట్ గంప్ లో ఉన్న సీన్స్ లో చిన్న పాటి మార్పులు చేస్తూ లాల్ సింగ్ చడ్డాను తెర‌కెక్కించారు.

వాటికి మ‌న‌వైన భావోద్వేగాల‌ను జోడించి ప్రేక్షకుల్ని మెప్పించాలని ప్రయత్నించారు. చారిత్ర‌క సంఘ‌టన‌ల‌తో ముడిపెడుతూ లాల్ సాగించిన ప్ర‌యాణంలో సినిమాటిక్ ఫీల్ తో సాగుతుంది తప్పితే ఒక్కడ ఓరిజినాలిటీ కనిపించదు.

IPL_Entry_Point