Pathaan Box Office Collections: పఠాన్ ప్రభంజనం.. అదిరిపోయో వసూళ్లు సరికొత్త రికార్డు-pathaan movie record collections at box office ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Pathaan Movie Record Collections At Box Office

Pathaan Box Office Collections: పఠాన్ ప్రభంజనం.. అదిరిపోయో వసూళ్లు సరికొత్త రికార్డు

Maragani Govardhan HT Telugu
Feb 13, 2023 02:08 PM IST

Pathaan Box Office Collections: షారుఖ్ నటించిన పఠాన్ సినిమా అదిరిపోయే వసూళ్లతో అదరగొడుతోంది. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 950 కోట్ల వసూళ్లతో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

పఠాన్ కలెక్షన్లు
పఠాన్ కలెక్షన్లు (HT_PRINT)

Pathaan Box Office Collections: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ చాలా రోజుల తర్వాత అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత పఠాన్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఈ స్టార్.. ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు. పాన్ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద విజయంగా ఈ సినిమా నిలిచింది. గత నెలలో రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది.

కేవలం విడుదలైన 19 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 950 కోట్ల మార్కును అందుకుంది. రూ.1000 కోట్ల మైలురాయిని అందుకునేందుకు అడుగు దూరంలో ఉంది. రెండు వీకెండ్లు పూర్తయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జోరు కొనసాగుతూనే ఉంది. ఈ అదివారం కూడా ఈ చిత్రం రూ.12.50 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

భారత్‌తో పాటు విదేశాల్లోనూ ఈ సినిమా కాసుల సునామీని సృష్టిస్తోంది. ఇప్పటికే యూఎస్, యూరప్ లాంటి దేశాల్లో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విపరీత ఆదరణ లభిస్తోంది. రూ.1000 కోట్ల క్లబ్‌ను సులభంగా చేరుకునేలా ఉంది. బాహుబలి రికార్డును కూడా బ్రేక్ చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ విడుదల కానుంది. దీపికా పదుకొణె హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాలో జాన్ అబ్రహం కీలక పాత్ర పోషించారు. విశాల్-శేఖర్ సంగీత దర్శకత్వం వహించారు.

IPL_Entry_Point