Shah Rukh Khan | షారుఖ్-అట్లీ సినిమా టైటిల్ ఫిక్స్.. స్పెషల్ వీడియో రిలీజ్-shah rukh and atlee movie title is fix and here the video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shah Rukh Khan | షారుఖ్-అట్లీ సినిమా టైటిల్ ఫిక్స్.. స్పెషల్ వీడియో రిలీజ్

Shah Rukh Khan | షారుఖ్-అట్లీ సినిమా టైటిల్ ఫిక్స్.. స్పెషల్ వీడియో రిలీజ్

Maragani Govardhan HT Telugu
Jun 03, 2022 07:39 PM IST

షారుఖ్, అట్లీ కాంబినేషన్‌లో రానున్న సినిమాకు జవాన్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. గౌరీ ఖాన్ నిర్మాత.

జవాన్‌లో షారుఖ్
జవాన్‌లో షారుఖ్ (Twitter)

బాలీవుడ్ బాద్ షా సినిమా చేసి దాదాపు నాలుగేళ్లు అవుతుంది. ఆయన ఇప్పటికే పఠాన్ అనే సినిమా చేస్తుండగా.. తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో ఓ చిత్రానికి పచ్చ జెండా ఊపారు. దీనికి సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా చిత్రబృందం అభిమానులను సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా టైటిల్, విడుదల తేదీని ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక వీడియోను షేర్ చేసింది.

జవాన్ అనే టైటిల్‌ను ఈ చిత్రానికి ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో షారుఖ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. వీటిల్లో ఓ పాత్రకు సంబంధించి లుక్‌ను వీడియో రూపంలో విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో షారుఖ్ సరసన నయనతార నటిస్తోంది. ఈ పాన్ఇండియా ప్రాజెక్టు వచ్చే ఏడాది జూన్ 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

పవర్‌ఫుల్ యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ వీడియోను షారుఖ్‌ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ చిత్రాన్ని షారుఖ్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మస్తున్నారు. రాజా రాణి, మెర్సెల్, బిగిల్ లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన అట్లీ.. షారుఖ్‌తో సినిమా చేయనుండటంతో అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

అట్లీ దర్శకత్వం వహించిన తెలుగులోనూ డబ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. షారుఖ్‌తో సినిమా తర్వాత.. అట్లీ ఎన్‌టీఆర్‍‌తోనూ ఓ చిత్రాన్ని చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్టుపై ఇంకా అధికారిక సమాచారం ఇవ్వలేదు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్