Cirkus OTT Release Date: బాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ సర్కస్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే
Cirkus OTT Release Date: బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచిన రణ్‌వీర్‌సింగ్ సర్కస్ సినిమా ఓటీటీలోకి రాబోతున్నది. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే...
Cirkus OTT Release Date: రణ్‌వీర్‌సింగ్, డైరెక్టర్ రోహిత్‌శెట్టి కాంబినేషన్‌లో రూపొందిన సర్కస్ సినిమా ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడన్నది క్లారిటీ వచ్చేసింది. ఈ పీరియాడికల్ ఎంటర్‌టైనర్ సినిమా ఫిబ్రవరి 17న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది.
ట్రెండింగ్ వార్తలు
బాలీవుడ్‌లో గత ఏడాది భారీ అంచనాలతో రిలీజైన సినిమాల్లో సర్కస్ ఒకటి. సింబా సక్సెస్ తర్వాత రణ్‌వీర్‌సింగ్, రోహిత్ శెట్టి కాంబినేషన్‌లో రూపొందిన సినిమా బాలీవుడ్‌ను నష్టాల బారి నుంచి గట్టెక్కిస్తుందని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ ఆ అంచనాల్ని తలక్రిందులు చేస్తూ డిజాస్టర్‌గా ఈ సినిమా నిలిచింది.
దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈసినిమా కేవలం 60 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. నిర్మాతలకు వంద కోట్ల నష్టాలను మిగిల్చింది. బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్‌లో ఒకటిగా నిలిచింది.
ఈ సినిమాలో రణ్‌వీర్‌సింగ్ డ్యూయల్ రోల్ చేశాడు. వేర్వేరు ప్రాంతాల్లో పెరిగిన ఇద్దరు కవల సోదరుల జీవితాల నేపథ్యంలో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ రోహిత్ శెట్టి ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమాలో రణ్‌వీర్‌సింగ్‌కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రలో కనిపించింది. విలియం షేక్స్‌పియర్ రాసిన ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అనే నాటకం ఆధారంగా రోహిత్ శెట్టి ఈ సినిమాను తెరకెక్కించారు. భూషణ్‌కుమార్‌తో కలిసి రోహిత్‌శెట్టి స్వయంగా ఈ సినిమాను నిర్మించడం గమనార్హం.