Rajamouli on Hindus and Muslims: ఆర్ఆర్ఆర్ కోసం హిందూ, ముస్లింల వ్యతిరేకత ఎదుర్కొన్నాను: రాజమౌళి-rajamouli on hindus and muslims objections to his movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajamouli On Hindus And Muslims: ఆర్ఆర్ఆర్ కోసం హిందూ, ముస్లింల వ్యతిరేకత ఎదుర్కొన్నాను: రాజమౌళి

Rajamouli on Hindus and Muslims: ఆర్ఆర్ఆర్ కోసం హిందూ, ముస్లింల వ్యతిరేకత ఎదుర్కొన్నాను: రాజమౌళి

Hari Prasad S HT Telugu
Feb 17, 2023 04:02 PM IST

Rajamouli on Hindus and Muslims: ఆర్ఆర్ఆర్ కోసం హిందూ, ముస్లింల వ్యతిరేకత ఎదుర్కొన్నట్లు చెప్పాడు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ది న్యూయార్కర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు ఆరెస్సెస్ గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

హిందూ, ముస్లిం.. ఆరెస్సెస్ పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
హిందూ, ముస్లిం.. ఆరెస్సెస్ పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Rajamouli on Hindus and Muslims: ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్స్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సయమంలో డైరెక్టర్ రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా కోసం తాను అటు హిందువులు, ఇటు ముస్లింల వ్యతిరేకతను ఎదుర్కొన్నట్లు చెప్పాడు. ముఖ్యంగా ఈ మూవీ ట్రైలర్ రిలీజైనప్పుడే అందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ అయిన భీమ్.. ముస్లిం టోపీ ధరించడంపై విమర్శలు వచ్చాయి.

తెలంగాణలో ఏ రజాకార్లపై పోరాడాడో అదే కొమురం భీమ్ పేరు మీదుగా ఈ సినిమాలో పాత్రను క్రియేట్ చేసి, ఆ పాత్రకు అలా ముస్లిం టోపీ పెట్టడమేంటని చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈ విమర్శలు తాజాగా ది న్యూయార్కర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి స్పందించాడు. సినిమా తీసే విషయంలో బీజేపీ మద్దతుదారులు లేదా ఆరెస్సెస్ నుంచి ముస్లింలకు వ్యతిరేకంగా లేదంటే జాతీయవాదానికి మద్దతుగా తీయాలన్న ఒత్తిడి ఏమైనా ఉందా అని ప్రశ్నించగా.. రాజమౌళి లేదని చెప్పాడు.

"లేదు. ప్రత్యక్షంగా ఎప్పుడూ లేదు. ఎలాంటి ఎజెండా అయినా ఆ ఎజెండాతో సినిమా తీయాలని ఎవరూ నన్న కోరలేదు. అయినా సరే చాలా కాలంగా కొంత మంది నా సినిమాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొన్నిసార్లు ముస్లింలు, కొన్నిసార్లు హిందువులు, కొన్నిసార్లు వివిధ కులాల వాళ్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు" అని రాజమౌళి చెప్పడం గమనార్హం.

ఇక ఆరెస్సెస్ గురించి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసిన స్క్రిప్ట్ తనను కొన్నిసార్లు కంటతడి పెట్టించేలా చేసిందన్న కామెంట్స్ పై కూడా రాజమౌళి స్పందించాడు. ఈ సంస్థ చరిత్ర గురించి మాత్రం తనకు పూర్తి అవగాహన లేదని కూడా చెప్పాడు. ఇక తన సినిమాలు చూసే ప్రేక్షకుల గురించి స్పందిస్తూ.. వాళ్లలో అన్ని రకాల వాళ్లూ ఉంటారని, తానెవరికీ వంత పాడనని స్పష్టం చేశాడు.

"ప్రేక్షకులు అంటే నా ఉద్దేశంలో థియేటర్ కు వచ్చి వినోదం పొందడానికి ఖర్చు చేసే వాళ్లు. నేను వాళ్లకు వినోదం అందిస్తాను. ప్రేక్షకులలో విపరీతమైన ఆలోచనా ధోరణలు ఉన్న వాళ్లు కూడా ఉంటారు. అంతమాత్రాన వాళ్లకు అనుగుణంగా నేను సినిమాలు తీయను. హిందూ లేదా సూడో లిబరల్ ప్రచారాలకు నేను దూరంగా ఉంటాను. నా ప్రేక్షకుల్లో అతివాద గ్రూపులు కూడా ఉంటాయి. నాకు తెలుసు, కానీ నేను వాళ్లను సమర్థించను. నేను కేవలం ప్రేక్షకుల భావోద్వేగ అవసరాలకు తగినట్లుగానే నడుచుకుంటాను" అని రాజమౌళి స్పష్టం చేశాడు.

Whats_app_banner

సంబంధిత కథనం